FERTILIZERS DONATED _ శ్రీవారికి రూ.2.73 లక్షల విలువైన ఫెర్టిలైజర్స్ విరాళం
Tirumala, 7 Jul. 21: The Coromandal International company from Hyderabad as donated Rs. 2.73lakh worth 301 bags of fertilizers to TTD on Wednesday.
The MD of the Company Sri Sameer Goel, President Sri Shankar Subramanyam have handed over the bags to TTD Garden Deputy Director Sri Srinivasulu in Garden Office located at Papavinasanam Road in Tirumala.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారికి రూ.2.73 లక్షల విలువైన ఫెర్టిలైజర్స్ విరాళం
తిరుమల, 2021 జూలై 07: హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఫెర్టిలైజర్స్ తయారీ సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌వారు 301 ఫెర్టిలైజర్స్ బస్తాలను శ్రీవారికి విరాళంగా అందించారు.
తిరుమల పాపావినాశనం రోడ్డులో గల టిటిడి గార్డెన్ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎమ్.డి. శ్రీ సమీర్‌గోయిల్, ప్రెసిడెంట్ శ్రీ శంకర్ సుబ్రమణ్యం రూ.2.73 లక్షలు విలువైన 14-35-14 – గ్రోశక్తి 140 బస్తాలు, భూభాగ్యా- 101 బస్తాలు, ఎన్‌రిచ్ – 20 బస్తాలు, కెరిచ్ – 20 బస్తాలు, పాస్‌గోల్డ్ – 20 బస్తాలు కలిపి మొత్తం 15 టన్నుల ఫెర్టిలైజర్స్ బస్తాలను టిటిడి గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీశ్రీనివాసులుకు అందచేశారు.
కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌వారు తమ క్రొత్త ఉత్పత్తులను మొదట శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నూతన ఉత్పత్తులైన గ్రోశక్తి, భూభాగ్యాలను స్వామివారికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సిఎఫ్‌వో శ్రీ జయశ్రీ శఠగోపన్, వైస్ ప్రెసిడెంట్లు శ్రీ జి.వి.సుబ్బారెడ్డి, శ్రీ భాస్కర్‌రెడ్డి, శ్రీ సత్యనారాయణ, శ్రీ కాళిదాస్ ప్రమానిక్, జోనల్ మేనేజర్ శ్రీ లక్ష్మణ్ మాధవ్, మార్కెటింగ్ అఫీసర్ శ్రీ మురళి పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.