ENHANCE SANATHANA DHARMA PRACHARAM SAYS TIRUPATI JEO_ సనాతన ధర్మ ప‌రిర‌క్ష‌ణ‌, ధ‌ర్మ‌ప్ర‌చారం విస్తృతం చేయాలి : తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

*ARCHAKAS TRAINING CONCLUDES AT SVETA

Tirupati, December 25,2018: The TTD JEO Sri Pola Bhaskar today urged the Archakas trained in sanatana Dharma pracharam should expand their activities for good of the society.

Addressing the trainee Archakas at the concluding session of fifth batch of Archakas In SVETA the JEO said the institution of Temple is a basic tenet of Indian culture, which should be preserved and protected to posterity. The Archakas should guide the youth and people in the right path of devotion and piousness to face all social hurdles.

He said by end of March 2019 nearly 500 archakas will be trained and deployed in remote areas to extend the Religious publicity program of TTD.They were trained in 15,10,5 days besides one month purses in various aspects of temples, Hindutva, archakatvam, social partnerships Later they were appointed Dharma Pracharaks and as members of the District pracharak committees.

The JEO presented puja material, certificates, Srivari portraits and Prasadam to the trained Archakas.

The HDPP secretary Dr Ramana Prasad, AEO Sri K Nageswar Rao, Supdt Sri Gurunatham and 32 trained archakas participated in the event

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సనాతన ధర్మ ప‌రిర‌క్ష‌ణ‌, ధ‌ర్మ‌ప్ర‌చారం విస్తృతం చేయాలి : తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

శ్వేతలో ముగిసిన రెండో దశ అర్చక శిక్షణ

డిసెంబర్ 25, తిరుపతి, 2018: సనాతన ధర్మ ప‌రిర‌క్ష‌ణ‌, ధ‌ర్మప్ర‌చారాన్ని శిక్ష‌ణ పొందిన అర్చకులు విస్తృతం చేయాల‌ని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో మంగ‌ళ‌వారం ఉద‌యం 5వ బ్యాచ్‌ అర్చక శిక్షణ సమాపనోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ దేవాలయ వ్యవస్థ భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, దీన్ని పరిరక్షించుకోవాలన్నారు. అర్చకుడు వ త్తి ధర్మాన్ని పాటిస్తూ ధర్మం వైపు ప్రజలను నడిపించాలన్నారు. ముఖ్యంగా యువతను భక్తిమార్గం వైపు మళ్లించాలని, ఆధ్యాత్మిక చింతన లేకపోతే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోలేరని అన్నారు. 2019 మార్చి చివ‌రికి 500 మందికి అర్చ‌క‌ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. హిందూ ధ‌ర్మిక కార్య‌క్ర‌మాల‌ను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లెందుకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని ధార్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు వివ‌రించారు.

ఒక్కో బ్యాచ్‌కు నెల‌రోజుల పాటు (15, 10, 5 రోజులు) శిక్షణ ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో ధర్మం, దేవాలయం, అర్చకత్వం, అర్చకుడు సమాజ భాగస్వామ్యం అనే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. శిక్ష‌ణ పొందిన అర్చ‌కులను, ధ‌ర్మ‌ప్ర‌చార‌కుల‌ను జిల్లా ప్ర‌చార మండ‌ళ్ల స‌భ్యులుగా నియ‌మించ‌న్నున్న‌ట్లు తెలిపారు.
అనంతరం జెఈవో చేతుల మీదుగా పూజాసామగ్రి, ధ్రువీకరణపత్రం, శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను శిక్షణ పొందిన అర్చకులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, ఏఈవో శ్రీ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్‌ శ్రీ గురునాథం, శిక్షణ పూర్తి చేసుకున్న 32 మంది అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.