REVIEW OF DISTRICT HDP COMMENCES_ జిల్లా ప్ర‌చార మండ‌ళ్ల కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష‌

Tirupati, 25 Dec. 18: Thereafter the JEO also reviewed and directed the members of HDPP committees to discuss action Plan for successful conduction of TTDs prestigious programs for Shubhapradam, Managudi, Krishnastami and Go puja.

He said such training programs for members of HDPPin Dharma pracharam at Vijayawada, Vishakapatnam, and Tirupati and. Hyderabad will be taken up soon.

He directed officials to be transparent in selecting the selection of members of HDPP, Srivari Sevakulu, Bhajan mandalis etc. with full coordination of all including the IT wing.

Dr Ramana Prasad, secretary of HDPP, OSD of Epic studies Acharya G Damodar Naidu, members of HDPP from both Telugu states participated in the review meeting of HDPP.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జిల్లా ప్ర‌చార మండ‌ళ్ల కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష‌

డిసెంబర్ 25, తిరుపతి, 2018: అనంత‌రం టిటిడి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న మ‌న‌గుడి, శుభ‌ప్ర‌ధం, కృష్ణాష్ట‌మి, గోపూజ త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌పై జిల్లా ధార్మిక మండ‌ళ్ల స‌భ్యుల‌తో చ‌ర్చించి, మ‌రింత విస్తృతంగా నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అదేవిధంగా జ‌న‌వ‌రిలో నిర్వ‌హించ‌నున్న గోపూజ‌పై స‌మీక్షించారు. రాబోవు రోజుల‌లో తిరుప‌తి, విజ‌య‌వాడ‌, వైజాగ్‌, హైద‌రాబాదుల‌లో జిల్లా ప్ర‌చార మండ‌ళ్ల స‌భ్యులకు శిక్ష‌ణ ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు.

ధ‌ర్మ‌ప్ర‌చార మండ‌లి స‌భ్యులు, శ్రీ‌వారి సేవ‌కులు, భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యుల‌ను టిటిడి ఐ.టి. విభాగం స‌హాకారంతో పూర్తి వివ‌రాలు సేక‌రించి, ధార్మిక కార్య‌క్ర‌మాలు వేగ‌వంతంగా క్షేత్ర‌స్థాయిలో నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వివ‌రించారు. భ‌జ‌న మండ‌ళ్ల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌క‌త పాటించాల‌ని సూచించారు.

ఈ సమావేశంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, ధార్మిక పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య జి.దామోదరనాయుడు, రెండు తెలుగు రాష్ట్రాల‌లోని అన్ని జిల్లాల‌కు చెందిన ధార్మిక మండ‌ళ్ల స‌భ్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.