SARASWATI ALANKARAM _ హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో దర్శనం ఇచ్చిన శ్రీవారు

TIRUPATI, 27 FEBRUARY 2025: On the second evening, Sri Venkateswara Swamy took out a celestial ride on Hamsa Vahanam in Saraswati Alankaram on Thursday in the ongoing annual fete at Jubilee Hills temple.

AEO Sri Ramesh, archakas, devotees participated in this vahana seva.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో దర్శనం ఇచ్చిన శ్రీవారు

హైద‌రాబాద్ / తిరుపతి, 2025 ఫిబ్రవరి 27: జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం రాత్రి శ్రీవేంకటేశ్వరుడు శ్రీ స‌ర‌స్వ‌తీ అలంకారంలో హంస‌ వాహనంపై అభయమిచ్చారు.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి

హంస వాహనసేవలో శ్రీ వెంకటేశ్వరస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది