SEA OF HUMANITY TURNS OUT FOR RADHA SAPTHAMI _ సంతృప్తికరంగా రథసప్తమి వాహనసేవల దర్శనం _ భక్తులకు విశేష సేవలందించిన టిటిడి సిబ్బందికి, శ్రీ‌వారి సేవ‌కుల‌కు ఛైర్మన్, ఈవో ధ‌న్య‌వాదాలు

OVER ONE LAKH CONVERGE IN GALLERIES

SAPTHA VAHANA SEVAS OBSERVED WITH APLOMB 

 ELABORATE ARRANGEMENTS BY TTD FOR THE ONE DAY BRAHMOTSAVAM-CHAIRMAN, EO

 ALMOST AFTER A YEAR TIRUMALA WITNESSES PILGRIMS INFLUX 

 Tirumala, 19 Feb. 21: All roads lead to the four Mada streets in Tirumala on Friday with pilgrims swarming the galleries in huge numbers to witness the Saptha Vahana Sevas of Srivaru on the auspicious day of Surya Jayanthi.

This year, the annual festival of Radha Sapthami assumed importance as this is the first time almost after eleven months, the pilgrims were allowed to witness the Vahana Sevas of Lord, after the Covid Pandemic marred all the festivities and forced the devotees to keep away from participation as they were performed in Ekantam. 

 

The surge of devotees was clearly seen since the early hours of Friday starting from Suryaprabha Vahanam and continued till the Saptha Vahana Seva concluded with Chandraprabha Vahanam. Over a lakh devotees witnessed the majesty of the Lord in various Alankarams on different vahanams.

Speaking to the media over the arrangements, TTD Chairman Sri YV Subba Reddy said, as this mega religious event is taking place after a long gap of almost a year post-Covid pandemic last year, anticipating a huge pilgrim rush, TTD made elaborate arrangements of Annaprasadam, water, security in each gallery all along the four Mada streets. In spite of the huge turnout of devotees, Annaprasadam and Jalaprasadam arrangements, buttermilk, milk, beverages etc. were made and distributed to pilgrims in each gallery with the help of Srivari Sevakulu. 

TTD EO Dr KS Jawahar Reddy said, over one lakh pilgrims have converged in galleries to witness the Vahana  Sevas on the day of Surya Jayanthi. On the other hand darshans are also going on in a smooth manner, he added. 

Additional EO Sri AV Dharma Reddy with other senior officers of TTD, CVSO Sri Gopinath Jatti with Security and Vigilance sleuths, Tirupati Urban SP Sri Venkata Appala Naidu with his team of Police officials and cops deputed for the Radha Sapthami duty were on rounds from dawn to dusk and personally monitored all the amenities being provided to pilgrims in galleries.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సంతృప్తికరంగా రథసప్తమి వాహనసేవల దర్శనం
 
భక్తులకు విశేష సేవలందించిన టిటిడి సిబ్బందికి, శ్రీ‌వారి సేవ‌కుల‌కు ఛైర్మన్, ఈవో ధ‌న్య‌వాదాలు
 
తిరుమల, 2021 ఫిబ్ర‌వ‌రి 19: సూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో కూర్చుని ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు. 
 
గ్యాల‌రీల్లో వేచి ఉన్న భ‌క్తుల‌కు టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగం ఆధ్వ‌ర్యంలో నిరంత‌రాయంగా అన్న‌ప్ర‌సాదాలు అందించారు. వెంగమాంబ భవనం, మాడ వీధుల్లోని గ్యాలరీలు కలిపి 3.46 ల‌క్ష‌ల అన్నప్రసాదం, మజ్జిగ, టి, కాఫీ, పాలు కలిపి 2.63 లక్షలు, 49 వేల అల్పాహారం స‌ర్వింగ్స్ చేశారు. ఉద‌యం 4 గంట‌ల నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు నిర్దేశించిన స‌మ‌యంలో భ‌క్తుల‌కు అన్న‌పానీయాలు అంద‌జేశారు. టి, కాఫి, పాలు, ఉప్మా, పొంగ‌ళి, సేమియా ఉప్మా, పులిహోర‌, సాంబార‌న్నం,  బిసిబెళా బాత్‌, ట‌మోటా రైస్‌, సాయంత్రం సుండ‌లు భ‌క్తుల‌కు పంపిణీ చేశారు.
 
వైద్య విభాగం ఆధ్వర్యంలో 40 వేల మందికి మందులు పంపిణీ చేశారు. 
 
టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వ‌ర్యంలో ఒక లక్ష తాగునీటి బాటిళ్లు, 60 వేల శానిటైజర్లు పంపిణీ చేశారు. మాడ వీధుల్లోని గ్యాల‌రీల‌తోపాటు ఇత‌ర ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ విభాగం ఆధ్వ‌ర్యంలో 1100 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవ‌లందించారు. నాలుగు మాడ వీధుల్లో పోగ‌యిన సుమారు 13 ట‌న్నుల చెత్త‌ను త‌ర‌లించారు. గ్యాల‌రీలకు అనుబంధంగా ఉన్న మ‌రుగుదొడ్ల వ‌ద్ద ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌ట్టారు.
 
శ్రీ‌వారి ఆల‌యం, మాడ వీధులు, ఇత‌ర కూడ‌ళ్ల‌లో విద్యుత్‌దీపాల‌తో అలంకరించారు. శ్రీ‌వారి ఆల‌యం, వాహ‌న మండ‌పం, మాడ వీధులు, ఇత‌ర ముఖ్య కూడ‌ళ్ల‌లో ఆక‌ట్టుకునేలా పుష్పాలంక‌ర‌ణ చేశారు. ఇందుకోసం దాత‌ల విరాళంతో 7 ట‌న్నుల సంప్ర‌దాయ పుష్పాలు, 40 వేల క‌ట్ ఫ్ల‌వ‌ర్స్ వినియోగించారు.
 
230 మంది టిటిడి నిఘా, భ‌ద్ర‌తా సిబ్బంది, 200 మంది పోలీసులు, 350 మంది ఎన్‌సిసి క్యాడెట్లు, శ్రీ‌వారి సేవకుల‌‌‌తో భ‌క్తుల‌కు భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. అన్ని విభాగాల్లో క‌లిపి దాదాపు 3000 మంది శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తుల‌కు సేవ‌లందించారు. మాడ వీధుల్లో భ‌క్తుల‌కు అందించే సౌక‌ర్యాల‌ను సీనియ‌ర్ అధికారులు ప‌ర్య‌వేక్షించారు.
 
టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో వాహ‌న సేవ‌ల్లో భ‌జ‌న బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో వాహ‌నం ఎదుట మూడు బృందాల చొప్పున మొత్తం 21 భ‌జ‌న బృందాలు పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో 15 మంది క‌ళాకారులు ఉన్నారు. నిపుణులైన పండితులు శ్రీ వేంకట్రామ శర్మ, శ్రీ శేషాచార్యులు, శ్రీ రామకృష్ణ శేషశాయి, శ్రీ చలపతి వాహ‌న‌సేవల స‌మ‌యంలో చ‌క్క‌గా వ్యాఖ్యానం చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహ‌న‌సేవ‌లను ప్ర‌త్య‌క్ష ‌ప్ర‌సారం చేశారు.
 
టిటిడి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాలు బాగున్నాయని ధన్యవాదాలు తెలియజేశారు.
 
టిటిడి సిబ్బందికి, శ్రీ‌వారి సేవ‌కుల‌కు ఛైర్మన్, ఈవో ధ‌న్య‌వాదాలు
 
ర‌థ‌స‌ప్తమి సంద‌ర్భంగా వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించేందుకు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు గ్యాల‌రీల్లో ఉన్న భ‌క్తుల‌కు టిటిడి అధికారులు, సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు, పోలీసులు విశేషంగా సేవ‌లందించార‌ని  టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ కొనియాడారు. ఈ సంద‌ర్భంగా వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.