SECOND HALF STARTS WITH CHAKRASNANAM IN EKANTAM _ ఏకాంతంగా చక్రస్నానం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీమలయప్పస్వామివారి అభయం

LORD COMPLETES SAPTHA VAHANA SEVA

Tirumala, 19 Feb. 21: After a hectic day in the first half, the second half commenced with Chakrasnanam as a part of Radhaspathami festivities in Tirumala.

Kalpavruksha Vahana, Sarvabhoopala Vahana and Chandraprabha Vahana followed the holy dip of Sri Sudarshana Chakrattalwar in the afternoon.

CHAKRASNANAM:

The Sudarshana Chakrattalwar was brought to Swamy Pushkarini in a procession on a palanquin. The Archakas performed holy snapanam and immersed the serrated sacred weapon in the Pushkarini waters. As the Central and State government Covid restrictions are yet to be relaxed on water bodies, the holy event is observed in Ekantam.

KALPAVRIKSHA VAHANAM:

Hindu mythology says that the Kalpavruksha has divine powers on par with Kamadhenu and Chintamani. All these three are known for granting boons. Srimad Bhagavatham says that all those who took shelter under Kalpavruksha became prosperous. By taking a celestial ride on the Kalpavriksha Vahana along with His two consorts Sridevi and Bhudevi Lord sent a message to His devotees that He is there to fulfill their genuine wishes.

SARVA BHOOPALA VAHANAM

Sarva Bhoopala meaning the Supreme Lord of Lords. Lord Venkateswara is the Supreme commander and even the Astadikpalas, Panchabhootas and other devaganas discharge their respective duties under His instructions. Lord Malayappa took a celestial ride on this finely decked carrier with His consorts to bless devotees.

CHANDRA PRABHA VAHANAM

The Sapta Vahana Seva of Lord concluded with Chandraprabha Vahanam on the fine evening of Friday.

Legends say that Chandra or the moon stands for highlighting medicinal values in all living beings including plants. Chandra is described as Lord Vishnu, the invisible architect who found remedies for all ailments of persons and plants.

The Bhagavat Geeta also mentions “Nakshatrana Aham Shashi” (I am the moon in the constellation) as the Lord referred Himself to the Moon. The Chandra Prabha Vahanam signifies that its very sight will provide soothing relief to devotees from physical and mental worries

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏకాంతంగా చక్రస్నానం

కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీమలయప్పస్వామివారి అభయం

తిరుమల, 2021 ఫిబ్ర‌వ‌రి 19: రథసప్తమి సందర్భంగా శుక్ర‌వారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల నడుమ చక్రస్నానం ఏకాంతంగా జరిగింది. ఆ తరువాత వరుసగా కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీమలయప్పస్వామివారు భక్తులకు అభయమిచ్చారు. శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడయ్యాడు. ఆ త‌రువాత చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు. కోవిడ్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో చ‌క్ర‌స్నానం ఏకాంతంగా చేప‌ట్టారు.

కల్పవృక్ష వాహనం

సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

సర్వభూపాల వాహనం

సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు.

చంద్రప్రభ వాహనం

రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులను కటాక్షిస్తారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

ఈ కార్యక్రమాల్లో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, బోర్డు స‌భ్యులు శ్రీ పార్థ‌సార‌థి, శ్రీ ముర‌ళీకృష్ణ‌, శ్రీమ‌తి ప్ర‌శాంతిరెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, ఇత‌ర బోర్డు స‌భ్యులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.