RADHASAPTHAMI COMMENCES IN GT WITH CHAKRASNANAM  _ సప్తవాహనాలపై భ‌క్తుల‌ను క‌టాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి

LORD GOVINDARAJA RIDES SEVEN VAHANAMS 

Tirupati, 19 Feb. 21: The Radhasapthami festivities in the most ancient temple of Sri Govindaraja Swamy in Tirupati commenced with Chakrasnanam during the early hours on Friday.

The Sudarshana Chakrattalwar was rendered Chakrasnanam in Ekantam in a huge vessel (Gangalam) at the  Kalyana Mandapam in the temple at 4:30am.

Later the Vahana Sevas commenced with Suryaprabha at 5:30am followed by Hamsa Vahana, Hanumantha Vahana, Pedda Sesha, Mutyapu Pandiri, Saravabhoopala and Garuda Vahanam. The devotees were enthalled at the sight of Saptha Vahana Seva of the deity.

Special Grade DyEO Sri Rajendrudu and other temple staff were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సప్తవాహనాలపై భ‌క్తుల‌ను క‌టాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి
 
తిరుపతి, 2021 ఫిబ్ర‌వరి 19: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని  పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించారు. శుక్ర‌వారం తెల్లవారుజామున  4.30 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఆల‌‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో వేంచేపు చేసి, గంగాళంలో చ‌క్ర‌స్నానం నిర్వహించారు.
 
అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి , సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం 7.00 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు‌  శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కామ‌రాజు, శ్రీ మునీంద్ర‌బాబు ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.