GODDESS CHEERS DEVOTEES ON SAPTHA VAHANAMS _ సప్తవాహనాలపై సిరులతల్లి అభయం
Tirupati, 19 Feb. 21: The Goddess of Prosperity, Sri Padmavathi Devi blessed Her devotees on Saptha Vahanams from dawn to dusk on Friday as part of Radhasapthami festivities observed in Tiruchanoor.
The Vahana Sevas commenced with Suryaprabha Vahanam at 7:30am followed by Hamsa, Aswa, Garuda, and Chinna Sesha till afternoon. Between 3:30pm and 4:30pm Snapana Tirumanjanam was performed to the Goddess. Later in the evening Chandraprabha and Gaja Vahana Sevas were performed.
On the other hand, in the sub-temple of Sri Suryanarayana, the processional deity took out a celestial ride on Aswa Vahanam and blessed the devotees at 6am.
DyEO Smt Jhansi Rani and other staff members were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సప్తవాహనాలపై సిరులతల్లి అభయం
తిరుపతి, 2021 ఫిబ్రవరి 19:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారు ఏడు వాహనాలపై భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఉదయం 7.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2.30 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరగనుంది. సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝూన్సీరాణి, విజివో శ్రీ మనోహర్, ఏఈవో శ్రీసుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.