SENIOR CITIZENS DARSHAN QUOTA TO RELEASE ON APRIL 26 _ వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం

TIRUMALA, 24 APRIL 2022: The online quota for senior citizens and physically challenged persons for the month of May will be released on April 26 by 10am.

TTD has resumed this category of darshan from April onwards after stalled it for two years following Covid Pandemic.

The devotees who have crossed 65years of age and physically challenged are eligible for this darshan.

The pilgrims falling under this category shall book the tickets in online https://tirupatibalaji.ap.gov.in. Every day TTD releases 1000 tokens.

The devotees will be allowed for darshan at 10am every day while on Fridays at 3pm. They should bring age proof, physically challenged certificates, medical certificate in the case of chronic diseases along with them while coming for darshan.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం

ఆన్‌లైన్‌లో అందుబాటులో ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు

వేచి ఉండాల్సిన పనిలేదు

 తిరుమల, 2022 ఏప్రిల్ 24: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారికి టిటిడి సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం చేయిస్తోంది. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో రెండేళ్ల త‌రువాత వృద్ధులు, దివ్యాంగుల ప్ర‌త్యేక ద‌ర్శ‌నాన్ని టిటిడి పున‌రుద్ధ‌రించింది. ఇందుకోసం ప్ర‌త్యేక ద‌ర్శ‌న టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతోంది. ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిర్దేశిత స్లాట్లో స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతోంది.

రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తున్నారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీరిని ప్ర‌తిరోజూ ఉద‌యం 10 గంట‌ల స్లాట్‌లో దివ్యాంగుల క్యూలైన్ ద్వారా ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. శుక్ర‌వారం నాడు మాత్రం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్ కేటాయించారు. వ‌యోవృద్ధులు వయసు ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు సంబంధిత ధ్రువీకరణ పత్రం, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు మెడికల్ సర్టిఫికేట్ చూపాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 26న మే నెల కోటా విడుదల

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారి కోసం మే నెలకు సంబంధించిన ప్ర‌త్యేక ద‌ర్శ‌న టోకెన్ల కోటాను ఏప్రిల్ 26వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.