CHAKRA SNANAM HELD AT NAGALAPURAM _ వైభవంగా నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి వారి చక్రస్నానం

TIRUPATI, 24 APRIL 2022: On the last day of the ongoing annual Brahmotsavam at Sri Veda Narayana Swamy temple in Nagalapuram, Chakra Snanam was held on Sunday.

After Snapana Tirumanjanam was performed to the utsava deities, the Sudarshana Chakrattalwar was rendered Avabhridotsavam amidst chanting of Veda mantras by Archakas.

In the evening Dhwajavarohanam will be observed.

AEO Sri Durgaraju and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి వారి చక్రస్నానం

తిరుప‌తి, 2022 ఏప్రిల్ 24: నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం ఉదయం ఆల‌య ప్రాంగ‌ణంలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు, చక్రత్తాళ్వార్ల‌కు స్నపనతిరుమంజనం వేడుకగా జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకాలు చేశారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

అనంత‌రం రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ దుర్గ రాజు, సూపరింటెండెంట్ శ్రీ నాగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ ఉదయ్ కుమార్, ఇతర అధికారులు, విశేష‌ భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.