SERVE DEVOTEES WITH SPIRIT AND SPIRITUALITY-CHAIRMAN TO SEVAKS _ శ్రీవారి సేవకులు స‌నాత‌న ధ‌ర్మ ర‌థ‌సార‌థులు

TIRUMALA, 28 SEPTEMBER 2022: Render service to fellow pilgrims with love, affection, spirit and spirituality said TTD Chairman Sri YV Subba Reddy in Asthana Mandapam on Wednesday.

 

Addressing the Srivari Sevaks who have come to render services to a multitude of visiting pilgrims during the ongoing annual Brahmotsavams, the Chairman said in the last 22years nearly 13lakh Srivari Sevaks hailing from different parts of the country have rendered services to the pilgrims with devotion and dedication.

 

He called on them to be a part in all the Dharmic programmes taken up TTD including Srinivasa Kalyanams, Venkateswara Vaibhavotsavams etc. and take forward Hindu Sanatana Dharma to the next level by acting as Torch-bearers.

 

Later Srivari Sevkas hailing from Karnataka, Tamilnadu apart from Telugu speaking states also shared their experiences and thanked TTD for the elaborate arrangements to sevaks as well as multitude of visiting pilgrims.

 

QR CODE INAUGURATED

 

TTD Chairman inaugurated the QR Code facility which would help the Srivari Seva volunteer his or her designated duty area without any problem with the route map which appears just by scanning the QR code with their mobile.

 

The Bhajana-Satsang program was also held on the occasion.

 

TTD EO Sri AV Dharma Reddy, Board Member Sri P Ashok Kumar, JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, PRO Dr T Ravi, VGO Sri Bali Reddy, APRO Kum Neelima, AEO Seva Sadan Smt Nirmala and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి సేవకులు స‌నాత‌న ధ‌ర్మ ర‌థ‌సార‌థులు

– భ‌క్తులకు సేవాభాగ్యం ఎంతో అదృష్టం

– టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 28: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ప్రేమతో సేవ‌లు అందించ‌డంతోపాటు టిటిడి వివిధ ప్రాంతాల్లో నిర్వ‌హిస్తున్న శ్రీ‌నివాస క‌ల్యాణాలు, వైభ‌వోత్స‌వాలు లాంటి ధార్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొని స‌నాత‌న ధ‌ర్మ ర‌థ‌సార‌థులుగా నిలుస్తున్నార‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు విచ్చేసిన శ్రీ‌వారి సేవ‌కుల‌కు తిరుమల ఆస్థానమండపంలో బుధ‌వారం అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లందించ‌డం శ్రీ‌వారి సేవ‌కుల అదృష్ట‌మ‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 22 సంవ‌త్సరాల క్రితం శ్రీ‌వారి సేవ‌ను ప్రారంభించిన‌ట్టు చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశం న‌లుమూల‌ల నుండి 13 ల‌క్ష‌ల మందికి పైగా సేవ‌కులు పాల్గొన్నార‌ని వెల్ల‌డించారు. ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు ఏడు రాష్ట్రాల నుంచి 3500 మంది సేవ‌కులు వ‌చ్చార‌ని తెలిపారు. రానున్న కాలంలో అన్ని జిల్లాల నుండి సేవ‌కుల సంఖ్య పెంచాల‌ని సూచించారు. తిరుమ‌ల‌తోపాటు తిరుప‌తిలోని స్థానికాల‌యాల్లో కూడా సేవ‌కులు సేవ‌లందిస్తున్న‌ట్టు చెప్పారు. దీంతో పాటు ప‌ర‌కామ‌ణి సేవ‌కూడా ఉంద‌న్నారు. రూ.23 కోట్ల‌తో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని బుధ‌వారం ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సీఈవో శ్రీ ష‌ణ్ముఖ్ కుమార్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, శ్రీవారి సేవ ఏఈవో శ్రీమ‌తి నిర్మ‌ల, శ్రీ‌వారి సేవ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.