SEVEN KIDS SUCCESSFULLY OPERATED FOR CLEFT LIP AND CLEFT PALATE _ బర్డ్‌లో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు

TIRUPATI, 09 December 2022: A total of Seven kids were operated on successfully for cleft lip and palate at the TTD-run BIRRD (T) Hospital on December 7 and the Doctors’ team were complimented by TTD EO Sri AV Dharma Reddy.

According to BIRRD Special Officer Dr Reddeppa Reddy, the operations included cleft lip and cleft palate. Among the patients, some are even months-old children, who were got admitted on December 5, operated on December 7 and got discharged on December 9 without any complications.

Lohitha 6m/F, Thanvish 9m/M, Nagahema 9m/F, Nagalakshmi 1Y/F, Rekha 2Y/F, Jahnavi 3Y/F, Naveen 12Y/M underwent surgeries successfully.

Dr Preetham Shetty and Dr Deepesh N Rao visiting professors from Bangalore along with the plastic surgeon of the Hospital Dr Jhansi operated the above patients and discharged them on Friday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

బర్డ్‌లో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు

– బెంగళూరు నుండి వైద్యనిపుణులు

– వైద్యబృందానికి టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అభినందనలు

తిరుపతి, 2022 డిసెంబ‌రు 09: టిటిడికి చెందిన బర్డ్‌ ఆసుపత్రిలో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు విజయవంతంగా గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇందుకు గాను వైద్యబృందానికి టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అభినందనలు తెలియజేశారు. శస్త్రచికిత్సలు చేసిన ఏడుగురు చిన్నారులను శుక్రవారం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జి చేసినట్లు బర్డ్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ రాచపల్లె రెడ్డెప్పరెడ్డి తెలిపారు.

ఆసుపత్రిలో ఈ ఏడాది సెప్టెంబరులో గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు ప్రారంభించారు. ఇప్పటివరకు 20 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు.
ఇందులోభాగంగా లోహిత(6 నెలలు), తన్విష్‌(9 నెలలు), నాగహేమ(9 నెలలు), నాగలక్ష్మి(ఒక సంవత్సరం), రేఖ(2 సంవత్సరాలు), జాహ్నవి(3 సంవత్సరాలు), నవీన్‌(12 సంవత్సరాలు) అనే చిన్నారులు డిసెంబరు 5న శస్త్రచికిత్సల కోసం ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. డిసెంబరు 7న వీరికి గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు చేశారు. వీరిలో ఇద్దరికి మాత్రం  పెదవికి, అంగిలికి(నోటిలోపల) రెండింటికీ శస్త్రచికిత్సలు చేశారు. శుక్రవారం డిశ్చార్జి చేశారు. బెంగళూరుకు చెందిన విజిటింగ్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ ప్రీతమ్‌శెట్టి, డాక్టర్‌ దీపేష్‌ ఎన్‌.రావు, బర్డ్‌ ఆసుపత్రి ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఝాన్సీ కలిసి ఈ శస్త్రచికిత్సలు చేశారు.

రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన చిన్నారులకు ఈ ఆసుపత్రి ఒక వరం లాంటిదని, మరింత మంది నిరుపేదలు ఈ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని బర్డ్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ రాచపల్లె రెడ్డెప్పరెడ్డి కోరారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.