FEAST OF MUSIC, DRUMS AND KOLLATAS ON MADA STREETS_ సింహ వాహనసేవ‌లో సాంస్కృతిక వైభ‌వం

Tirumala, 12 October 2018: It was a cultural bonanza of Kolatas, Walking gods and frenzied drum beating by hundreds of artisans as part of the ongoing Navaratri Brahmotsavams as the celestial Simha Vahanam of Lord Malayappaswamy sped ecstatically on the Mada streets on Friday.

The cultural activities including skits on Lord Narasimha, walking gods, drum beating and the artist teams rolled out by the cultural wings of TTD- HDPP, Dasa Sahitya project and the Annamayya Projects, staged kolatas.

The team of Dindigul drums from Tamil Nadu staged fantastic drum beating by 20 odd artists comprising of 10 big drums, 10 small and 9 dapulus.

A team from Tumkur in Karnataka led by Sujayakrishna staged Prahalad Charitra- play skit on the Mada Street earning kudos by devotees in the galleries. 30-member team staged Varahavataram, Hiranyakashupu samharam and Narasimhavataram episodes.

The Annamacharya project had rolled out Kolatas by artists from Visakhapatnam led by Smt SV Tulasiratnam with two teams of 15 members each from East Godavari Dist and Tirupati. The artists including tiny tots danced rhythmically to the tunes of Annamayya sankeertans.

Similarly another 15-member team led Bv Smt S Satyadevi of the Sri Vengamamba bhakta mandali of Visakhapatnam staged bhajans at the Annamayya mandapam on the south mada streets.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సింహ వాహనసేవ‌లో సాంస్కృతిక వైభ‌వం

అక్టోబ‌రు 12, తిరుమల 2018: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు యోగన‌ర‌సింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఈ సంద‌ర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

ఈ సంద‌ర్భంగా టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో దిండుగ‌ల్ డ్ర‌మ్స్ వాయిద్యం అలరించింది. త‌మిళ‌నాడులోని గుడియాత్తానికి చెందిన శ్రీ టి.ఎస్‌.కార్తి నేతృత్వంలో 30 మంది క‌ళాకారులు అడుగులు వేస్తూ ల‌య‌బ‌ద్ధంగా డ‌ప్పు వాయించారు. ఇందులో 10 పెద్ద డ్ర‌మ్స్, 10 త‌ప్పెట్లు, 9 డ‌ప్పులు, ఒక తుడుం ఉన్నాయి. ఏడేళ్లుగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్నామ‌ని క‌ళాకారులు తెలిపారు.

టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ప్ర‌హ్లాద చ‌రిత్ర నృత్య‌రూప‌కం ఆక‌ట్టుకుంది. క‌ర్ణాట‌క రాష్ట్రం తుముకూర్‌కు చెందిన శ్రీ సుజ‌య‌కృష్ణ నేతృత్వంలో శ్రీ ప‌ద్మ‌ప్రియ భ‌జ‌న మండ‌లికి చెందిన 30 మంది క‌ళాకారులు ప్ర‌హ్లాద చ‌రిత్ర నృత్య రూప‌కాన్ని చ‌క్క‌గా ప్ర‌ద‌ర్శించారు. ఇందులో హిర‌ణ్యాక్ష సంహారం – వ‌రాహావ‌తారం, హిర‌ణ్య‌క‌శిపుని సంహారం – న‌ర‌సింహావ‌తారం ఘ‌ట్టాల‌ను అభిన‌యించారు. నార‌ద ముని, బ్ర‌హ్మాది దేవ‌త‌ల వేష‌ధార‌ణ ఆక‌ట్టుకుంది.

టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కోలాట ప్ర‌ద‌ర్శ‌న‌లు చ‌క్క‌గా ఉన్నాయి. విశాఖ‌కు చెందిన శ్రీ‌మ‌తి ఎస్‌.వి.తుల‌సీర‌త్నం నేతృత్వంలోని శ్రీ హ‌రినామ కోలాట బృందంలో 15 మంది, తూర్పుగోదావ‌రికి చెందిన శ్రీమ‌తి ఎన్‌.వీరాకుమారి నేతృత్వంలోని శ్రీ హ‌రి శ్రీ‌మ‌న్నారాయ‌ణ కోలాట భ‌జ‌న మండ‌లికి చెందిన 15 మంది, తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి కె.స‌ర‌స్వ‌తి నేతృత్వంలోని శ్రీ వెంక‌ట‌ప‌ద్మావ‌తి కోలాట బృందంలోని 15 మంది క‌ళాకారులు కోలాటం ప్ర‌ద‌ర్శించారు. ప‌లు అన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌కు ల‌య‌బ‌ద్ధంగా అడుగులు వేస్తూ ప్ర‌ద‌ర్శించిన కోలాటం ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అదేవిధంగా, ద‌క్షిణ మాడ వీధిలోని శ్రీ అన్నమ‌య్య మండ‌పంలో విశాఖ‌కు చెందిన శ్రీ‌మ‌తి ఎన్‌.స‌త్య‌దేవి నేతృత్వంలోని శ్రీ వెంగ‌మాంబ భ‌క్త మండ‌లికి చెందిన 15 మంది క‌ళాకారులు భ‌జ‌నలు చేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.