LORD SHINES ON SIMHA VAHANAM_ సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో శ్రీ మలయప్ప

Tirumala, 12 October 2018: On the third day of the Srivari Navaratri Brahmotsavams on Friday morning, Sri Malayappa Swamy, blessed devotees on ferocious golden Simha Vahanam.

Significance

The incarnation of Lord Vishnu as the Mrugendrudu (most ferocious and strong among the animals, Lion) is an indication of Lord as a powerful avatar to punish the wrong doers in the universe and protection of the righteous, poor and the weaker sections in the society.

In the Yoga shastra – a Lion was seen as an embodiment of power and speed. The valour of Lord Venkateswara who had made such an animal as his vehicle is thus displayed in abundance.

The statues of Lions in the Ananda Nilayam, in the Srivari temple complex have also indicate the power of Lion King. The idols of Narasimha in Yoga mudra in the temple and also the idol of Lakshmi Narasimha on the way to Tirumala in Alipiri footpath route exhibits the significance of Lion (Simha) in the celestial entourage of Lord Venkateswara.

TTD EO Sri Anil Kumar Singhal, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, VGO Sri Raveendra Reddy, Temple Staff and devotees took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో శ్రీ మలయప్ప

అక్టోబ‌రు 12, తిరుమల 2018: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్ర‌వారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్ప సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త పోస్ట‌ల్ శాఖ రూపొందించిన సింహ వాహ‌నం పోస్ట‌ల్ క‌వ‌ర్ ను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్ ఆవిష్క‌రించారు.

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు.

కాగా, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన శ‌నివారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.