SAPTHAGIRI IS THE MOST SOUGHT AFTER SPITRITUAL MAGAZINE_ సప్తగిరి మాసపత్రిక ద్వారా విస్తృంగా సనాత‌న ధర్మప్రచారం – ప్ర‌ధాన సంపాదకులు డా.కె.రాధారమణ

Tirumala, 12 October 2018: The multilingual monthly magazine of TTD, the Saptagiri magazine, is the most sought after spiritual magazine, said Chief Editor, Dr Radha Ramana.

Addressing media persons at the Media centre of the Rambagicha Rest House 2 on Friday, he said that since 1949 the magazine has been contributing for the propagation of Hindu Sanatana Dharma and has taken a full shape of multi color magazine and coming out in six languages including Telugu, Tamil, Kannada, Hindi, English and Sanskrit.

He said as of today nearly 1.83 lakh subscribers have registered for Sapthagiri magazine. The lifetime membership is Rs.500 and annual subscription of Rs.60 and lifetime membership for overseas is Rs.850.

He said interested could send DD in the name of Chief Editor, Saptagiri, TTD Press compound, KT Road, Tirupati- 517057 and phone 0877-2264543 and contact for details on email id sapthagiri_helpdesk@tirumala.org


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సప్తగిరి మాసపత్రిక ద్వారా విస్తృంగా సనాత‌న ధర్మప్రచారం – ప్ర‌ధాన సంపాదకులు డా.కె.రాధారమణ

అక్టోబ‌రు 12, తిరుమల 2018: సప్తగిరి మాసపత్రిక ద్వారా సనాతన ధార్మిక, నైతిక విలువలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని సప్తగిరి మాసపత్రిక ప్ర‌ధాన సంపాదకులు డా.కె.రాధారమణ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరుని దర్శించేందుకు వస్తున్నలక్షలాది భక్తులకు అందిస్తున్నసేవలు, సౌకర్యాలను తెలియజేయడంతోపాటు క్షేత్రమహిమ, పౌరాణిక, వైదిక విజ్ఞానాన్నివిస్తృతం చేయడంలో భాగంగా 1949 ఏప్రిల్ మాసంలో కరపత్రిక సదృశ్యమైన పత్రిక వెలువడిందన్నారు. సప్తగిరులకూ, సప్తగిరీశ్వరునికీ ప్రతీకగా సప్తగిరి అనే పేరును పెట్టారని అన్నారు. నాటి నుండి భక్తి, ధార్మికం, ఆధ్యాత్మికం, ఇతర పుణ్యక్షేత్రాలు, దేవతలు, త్రిమధమతాచార్యుల విశేషాలు, సిద్ధాంతాలు, ధార్మిక, తాత్విక గ్రంథాలను సప్తగిరి మాసపత్రికలో టిటిడి అందిస్తోందన్నారు. ప్రస్తుతం ఈ మాసపత్రిక ఆరు భాషలలో (తెలుగు, ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడం, సంస్కృతం) వెలువడుతోందన్నారు. ధర తక్కువైనా, విశిష్టత ఎక్కువ ఉన్న ఏకైక పత్రిక ఇదొక్కటేనని, చందాను ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాక టిటిడి వెబ్ సైట్ లో ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. 2016 జనవరి మాసం నుంచి సప్తగిరి మాసపత్రికను పూర్తి స్థాయిలో రంగుల్లోకి తీసుకొచ్చామన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 1,83,000 మంది పాఠకులు చందాదారులుగా ఉన్నారని అన్నారు. సంవత్సర చందా రూ.60/-, జీవిత చందా రూ.500/-, ఇతర దేశాల వారికి సంవత్సర చందా రూ.850/-. కొత్తగా చందాదారులుగా నమోదు కావాలంటే చీఫ్ ఎడిటర్, సప్తగిరి, టిటిడి, తిరుపతి పేరిట డిడి లేదా ఈఎంవో, ఎంవో, పోస్టల్ ఆర్డర్ తీసి ప్రధాన సంపాదకులు, సప్తగిరి కార్యాలయం, టిటిడి ప్రెస్ కాంపౌండ్, కె.టి.రోడ్, తిరుపతి- 517507 , ఫోన్ నెం. 0877-2264543, అనే చిరునామాకు పంపించాలన్నారు. ఆన్ లైన్ లో కూడా ఇదే పేరిట చెల్లించవచ్చని అన్నారు. ఫిర్యాదులు, సలహాలు, సూచనలను sapthagiri_helpdesk@tirumala.org ఈ మెయిల్ ఐడికి పంపించాలన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.