SPECIAL ABHISHEKAM TO SRI LAKSHMI NARASIMHA SWAMY _ 29న మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం

Tirumala, 24 November 2024: Special Abhishekam will be performed to Sri Lakshmi Narasimha Swamy, on the first ghat road of Tirumala on November 29.  

It is customary to perform a special abhishekam at the temple every year on the occasion of Swathi Thirunakshatram, the advent of the Birth Star of Sri Lakshmi Narasimha Swamy in the auspicious month of Kartika.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

29న మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం

తిరుమల, 2024 నవంబరు 24: ఈనెల 29వ తేది తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం జరగనుంది. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.