KOIL ALWAR TIRUMANJANAM IN TIRUCHANOOR _ న‌వంబ‌రు 26న‌ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 24 NOVEMBER 2024: The Koil Alwar Tirumanjanam in connection with the annual Brahmotsavam of Sri Padmavati Ammavaru temple at Tiruchanoor will be held on November 26.

TTD has cancelled all arjita sevas in the temple from November 26 to December 08 in connection with the annual Brahmotsavams.

On November 27, Laksha Kumkumarchana will be observed in the temple on November 27 from 8am till 12noon.

The schedule of Kartika Brahmotsava Vahana Sevas as follows:

28.11.2024 Dhwajarohanam between 9am and 9.30am

7pm – 9pm :

Chinna Sesha Vahanam           

29.11.2024  8am – 10am : Peddasesha Vahanam 

7pm – 9pm Hamsa Vahanam 

30.11.2024: 8am – 10am Mutyapu Pandiri 

7pm-9pm : Simha Vahanam 

01.12.24 : 8am – 10am Kalpavriksha Vahanam 

7pm – 9pm : Hanumanta Vahanam 

02.12.24 : 8am – 10am 

Pallaki Vahanam

7pm to 9pm : Gaja Vahanam 

 03.12.24 : 8am – 10am: Sarvabhupala Vahanam

4.20pm – 5.20pm Golden Chariot 

7pm – 9pm Garuda Vahanam 

04.12.24 :  8am – 10am – Surya Prabha Vahanam

7pm – 9pm: Chandraprabha Vahanam

05.12.24:8am – 10am Rathotsavam

7pm – 9pm : Aswa Vahanam 

06.12.24 :  7am – 8am Pallaki Utsavam

12.15pm – 12.20pm

Panchami Theertham 

07.12.2024 : Evening – Pushpayagam 

TTD has made elaborate arrangements for the Navahnika Karthika Brahmotsavams of Sri Padmavati Ammavaru in Tiruchanoor.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న‌వంబ‌రు 26న‌ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2024 నవంబరు 24: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 28 నుండి డిసెంబ‌ర్ 6వ తేది వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 26న‌ మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జ‌రుగ‌నుంది.

ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి స‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడ‌తారు. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార‌ణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టిటిడి రద్దు చేసింది. అదే విధంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

నవంబరు 27న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 27వ తేదీ బుధవారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.1,116/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్దగల కౌంటర్‌లో కరంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందొచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.

న‌వంబ‌రు 27న అంకురార్ప‌ణ

న‌వంబ‌రు 27వ తేదీ సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు.

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల వాహన సేవల వివరాలు

తేది సమయం – వాహన సేవలు
28.11.2024 ఉ. 9.00 – ఉ.9.30 ధ్వజారోహణము
రాత్రి 7.00 – 9.00 చిన్నశేష వాహనము

29.11.2024 ఉ. 8 – 10 పెద్దశేష వాహనము
రా.7 – 9 హంస వాహనము
30.11.2024 ఉ. 8 – 10 ముత్యపు పందిరి వాహనము
రా. 7- 9 సింహ వాహనము
01.12.24 ఉ. 8 – 10 కల్పవృక్ష వాహనము
రా. 7 – 9 హనుమంత వాహనము
02.12.24 ఉ. 8 – 10 పల్లకి వాహనము
రా. 7 – 9 గజ వాహనము
03.12.24 ఉ. 8 – 10 సర్వభూపాల వాహనము
సా.4.20 – 5.20 స్వర్ణ రథోత్సవము
రా. 7 – 9 గరుడ వాహనము
04.12.24 ఉ. 8 – 10 సూర్య ప్రభ వాహనము
రా. 7 – 9 చంద్రప్రభ వాహనము
05.12.24. ఉ. 8 – 10 రథోత్సవము
రా. 7 – 9 అశ్వవాహనము
06.12.24 ఉ. 7 – 8 పల్లకీ ఉత్సవము
మ.12.15 – 12.20 పంచమి తీర్థము, రాత్రి: ధ్వజావరోహణం

07.12.2024 : సాయంత్రం – పుష్పయాగం

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.