SPECIAL POOJAS FOR VARALAKSHMI VRATAM POOJA _ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం పూజాసామగ్రికి ప్ర‌త్యేక పూజ‌లు

Tirupati, 13 August 2021: TTD on Friday organized special pujas for the prasadam and puja material meant for dispatch to devotees who bought tickets of the virtual Sri Varalakshmi vratam performed at the Sri Padmavati Ammavari temple, Tiruchanoor slated for August 20.

 

Earlier the TTD officials and archakas carried the puja material in a pradakshina around the temple before placing the material, Uttarium, blouse piece, turmeric and Sinduri, bangles, Akshintalu, Kankanas and Kalakand prasadam at the feet of deity for pujas.

 

Thereafter the material was handed over to the officials of the India Posts for dispatch to reach devotees in time for the festival.

 

BANGLES DONATED

 

Devotees from Tiruchanoor Sri Shanmugam and Sri Edukondalu from Tirupati have donated 1000 dozens and 1500 dozens of bangles respectively for distribution to devotees of Sri Padmavati Ammavaru during the holy Shravana month.

 

Temple DyEO Smt Kasturi bai, postal Superintendent Sri Srinivas Rao, AEO Sri Prabhakar Reddy, Temple superintendent Sri Seshagiri, archaka Sri Babu Swamy and Temple inspector Sri Rajesh were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం పూజాసామగ్రికి ప్ర‌త్యేక పూజ‌లు
 
 
తిరుప‌తి, 2021, ఆగస్టు 13: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఆగస్టు 20న వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నున్న‌ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఆన్‌లైన్ టికెట్ల‌ను బుక్ చేసుకున్న భక్తులకు బట్వాడా చేసేందుకు సిద్ధం చేసిన పూజాసామగ్రికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
 
ముందుగా ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌తో క‌లిసి పూజాసామ‌గ్రిని ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ త‌రువాత అమ్మ‌వారి మూల‌విరాట్టు పాదాల వ‌ద్ద ఉత్త‌రీయం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షింత‌లు, కంక‌ణాలు, కలకండ ఉంచి పూజ‌లు చేశారు. అనంత‌రం ఈ పూజాసామ‌గ్రిని గృహ‌స్తుల‌కు బ‌ట్వాడా చేసేందుకు పోస్ట‌ల్ అధికారుల‌కు అంద‌జేశారు.
 
 
అమ్మవారికి గాజులు విరాళం
 
 
ప‌విత్ర శ్రావ‌ణ మాసం సంద‌ర్భంగా తిరుచానూరుకు చెందిన శ్రీ ష‌ణ్ముగం వెయ్యి డ‌జ‌న్లు, తిరుపతికి చెందిన శ్రీ ఏడుకొండలు 1500 డజన్ల గాజులను శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి కానుకగా అందించారు. శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు ప్ర‌సాదంగా ఈ గాజులు అందించాల‌ని ఆల‌య అధికారుల‌ను దాత‌లు కోరారు.  
 
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరిబాయి, పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసరావు, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ శేషగిరి, అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌ పాల్గొన్నారు.
 
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.