SPECIAL SHASRA KALASABHISHEKAM HELD _ శ్రీ భోగశ్రీనివాసమూర్తికి వేడుకగా ప్రత్యేక సహస్రకలశాభిషేకం
Tirumala, 16 June 2024: The special annual ‘Sahasra Kalasabhishekam’ of Bhoga Srinivasa Murthy, the silver replica idol of the presiding deity of Sri Venkateswara Swamy, was observed with religious fervour in Tirumala temple on Sunday.
In this ritual held at the Bangaru Vakili, the utsava murthies were anointed with 1000 Kalasas of sacred water from 6am to 8:30am. amidst chanting of relevant vedic hymns.
TTD has been observing this ritual once in a year since 2006, commemorating the historical presentation of the 18-inch silver idol of Bhoga Srinivasa Murty, also known as the Koutuka Beram or Manavala Perumala presented to the Tirumala temple by the Pallava Queen Samavai (Perundevi) in the year 614 A.D.
TTD JEO Sri Veerabrahmam, temple DyEO Sri Lokanatham and other temple staff were present in this ritual held inside the temple in Ekantam.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ భోగశ్రీనివాసమూర్తికి వేడుకగా ప్రత్యేక సహస్రకలశాభిషేకం
తిరుమల, 2024 జూన్ 16: శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్రకలశాభిషేకం ఆదివారం వేడుకగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేశారు.
శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడాళ్వార్ సన్నిధిలో కౌతుకమూర్తి అయిన శ్రీ మనవాళపెరుమాళ్(శ్రీ భోగ శ్రీనివాసమూర్తి)ను, ఆయన కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఉంచారు. తర్వాత శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేశారు. అనగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకాధి క్రతువులు మూలమూర్తికి నిర్వహించినట్లు అవుతుంది.
అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా, అర్చకస్వాములు ప్రత్యేక సహస్రకలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించారు.
ఆలయంలో ఏకాంతంగా జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల్ దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, పేష్కార్ శ్రీ శ్రీహరి, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు, పడికావిలి ఏఈవో శ్రీ నాయక్,
పార్‌పత్తేదార్ శ్రీ తులసి ప్రసాద్,ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది