SPIRITUAL CULTURAL FEAST TO DEVOTEES_ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం
Tirumala, 19 September 2018: The devotees who thronged the Tirumala shrine to witness brahmotsavams, were privy to a cultural feast of bhakti music, devotionalk ballads, discourses, folk dances and finally tasteful and colorful electric bill boards and display of mythological dieties in live form at the four mada streets.
It was an all out effort by the scores of bhajan mandalis and cultural troupes from all over country and artisans teams rolled out by the TTD dharmic and cultural wings- HDPP, Annamacharya project, Dasa Sahitya Project, Alwar Divya Prabandam project and the SV college of Dance and Music.
Besides the mandapams on the four mada streets, thousands of artists staging their skills at Nada Niranjanam, Asthana Mandapam at Tirumala and Mahati auditorium, Annamacharya Kalamandiram at Tirupati.
At the Nada Niranjanam open theatre on Wednesday, the troupe of Sri Hari babu and Sharat babu presented Mangala dwani in the monring followed by Veda Parayanam by students of SV Veda Pathasala and Vishnu Sahasranamam by Smt M Sridevi team of Tirupati.
There was a dharmic discourse by Sri Nori Narayanamurthy of Tenali, Annamayya Vinnapalu by Chennai based Sri Janani team followed by Nama Sankeertan by the Channi Sri Ayyakudi Anantakrishna Bhagavatar.
Later in the evening, Sri Shivarathna team rendered sankeeerthana alpam at the Unjal seva and sankeertans by Sri K Shivarathnam team of Tirupati. Finally the Smt G Varalakshmi team presented Harikatha Ganam in the night.
Meanwhile at the Asthana mandapam of Tirumala the Sri Santosh Gaddanakere team from Bagalkot in Karnataka presented Bhakti sangeet which enthralled the audience.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం
తిరుమల, 2018 సెప్టెంబరు 19: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాల ద్వారా కళాకారులు సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం 5.00 నుండి 5.30 గంటల వరకు శ్రీ వి.హరిబాబు, శ్రీ ఎ.శరత్‌బాబు బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి ఎస్వీ వేద పాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం, నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఎం.శ్రీదేవి బృందం విష్ణుసహస్రనామం, ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు తెనాలికి చెందిన శ్రీ నోరి నారాయణమూర్తి ధార్మికోపన్యాసం చేశారు. మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు చెన్నైకు చెందిన జనని బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ అయ్యకూడి అనంతకృష్ణ భాగవతార్ బృందం నామసంకీర్తన చేశారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజలసేవలో తిరుపతికి చెందిన శ్రీ కె.శివరత్నం బృందం సంకీర్తనాలాపన, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీమతి జి.మునిలక్ష్మీ భాగవతారిణి హరికథాగానం చేయనున్నారు.
అదేవిధంగా తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం 11.00 నుంచి 12.30 గంటల వరకు భాగల్‌కోట్‌కు చెందిన శ్రీ సంతోష్ గద్దెనకేరే బృందం భక్తి సంగీతం వినిపించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.