SPORTS EVENT GETS MORE ENTHUSIASTIC _ టిటిడి అధికారుల క్రికెట్ విజేత అదనపు సివిఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి జట్టు

Tirupati, 7 Feb. 20: The ongoing TTD employee’s annual sports meet-2020, on Friday witnessed interesting victories.

Additional CVSO Sri Shiva Kumar Reddy team were victorious in the cricket event and trounced the team lead by TTD SE I Sri Ramesh Reddy.

  • In the Tennikoit doubles event for the TTD retired employees the team lead by D Sudhakar Reddy and GN Subramanyam defeated B Panduranga Reddy and B Vijaisai Reddy team.
  • In the ball badminton event for Men below 40 yrs., R Balaji Singh team defeated C Kiran team.
  • In the common category volleyball event the S Vinod Babu team won over the O Obul Reddy team.
  • In the shuttle singles event for 50 plus category KN Ramakrishna was victorious over C Venkataramana.
  • In the shuttles doubles event P Vishwanath and P Venkataramana defeated KN Ramakrishna and T Prabhakar team.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

టిటిడి అధికారుల క్రికెట్ విజేత అదనపు సివిఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి జట్టు

తిరుపతి, 2020 ఫిబ్రవరి 07: టిటిడి ఉద్యోగుల క్రీడల్లో భాగంగా శుక్రవారం అధికారుల జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో అదనపు సివిఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి జట్టు విజయం సాధించింది. టిటిడి ఎస్ఇ శ్రీ రమేష్ రెడ్డి జట్టు రన్నరప్ గా నిలిచింది. టిటిడి ఉద్యోగుల క్రీడలు తిరుపతిలోని పరిపాలనా భవనంలోని పరేడ్‌ మైదానం, ఇతర మైదానాల్లో శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి.- టిటిడి విశ్రాంత ఉద్యోగుల టెన్నికాయిట్ డబుల్స్‌ పోటీలలో డి. సుధాకర్ రెడ్డి, జిఎన్.సుబ్రహ్మణ్యం నాయుడు జట్టు విజయం సాధించగా, బి.పాండురంగారెడ్డి, బి.జయరామిరెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది.

– 40 ఏళ్ల లోపు పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఆర్.బాలాజి సింగ్ జ‌ట్టు విజేతగా నిలవగా, సి.కిరణ్ జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

– కామన్ కేటగిరీ వాలీబాల్‌ పోటీలలో ఎస్.వినోద్ బాబు జ‌ట్టు విజయం సాధించగా, ఓ.ఓబుల్ రెడ్డి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

– 50 ఏళ్లు పైబడిన పురుషుల ష‌టిల్ సింగిల్స్ పోటీలలో కెఎన్.రామకృష్ణ విజయం సాధించగా, పి.వెంకటరమణ రన్నరప్‌గా నిలిచారు.

– ష‌టిల్ డబుల్స్‌ పోటీల్లో పి.విశ్వనాథ్, పి.వెంకటరమణ జట్టు విజయం సాధించగా, కెఎన్.రామకృష్ణ, టి.ప్రభాకర్ రెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.