6th DAY FLOAT RIDE OF SRI GOVINDARAJA SWAMY _ తెప్ప‌పై శ్రీగోవిందరాజస్వామివారు అభ‌యం

Tirupati, 7 Feb. 20: On the penultimate day of the annual Teppotsavams of Sri Govindarajaswamy temple in Tirupati, the utsava idols of Sri Govindaraja Swamy with Sridevi and Bhudevi were taken on seven rounds in the Pushkarini on Friday evening.

Earlier the utsava idols of Sri Govindarajaswamy and his consorts were give grand snapana thirumanjanam and later paraded along mada streets followed by float festival.

The artists of the HDPP and Annamacharya Project presented bhajans, Harikatha etc on the occasion.

Sri Sri Sri Pedda Jeeyar Sri Sri Sri Chinna Jeeyar, Special grade DyEO Smt Varalakshmi, AEO Sri Ravi Kumar Reddy, Superintendents Sri Raj Kumar and temple inspectors Sri Krishna Murthy and Sri Munindra Babu and large number of devotees participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

                                        
తెప్ప‌పై శ్రీగోవిందరాజస్వామివారు అభ‌యం
 
తిరుపతి, 2020 ఫిబ్రవరి 07 ;తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా 6వ రోజు శుక్ర‌వారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
 
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 6.30 నుండి 8.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
 
తెప్పలను అధిరోహించిన స్వామివారు శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా శ‌నివారం శ్రీగోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.
 
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఆలయ ప్రత్యేకశ్రేణి  డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ శ‌ర్మ‌, శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఏ.పి.శ్రీ‌నివాస దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర‌బాబు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.