SRAVANA POURNAMI GARUDA SEVA OBSERVED _ తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

Tirumala 26 August 2018: On the auspicious occasion of Sravana Pournami on Sunday, Garuda Vahana Seva was observed in Tirumala.

Devotees thronged in huge numbers to witness the grandeur of the procession of Sri Malayappa Swamy on mighty Swarna Garuda.

Even as the procession was on along the four mada streets, the devotees chanted “Govinda Govinda” with utmost devotion.

The vahana seva took place between 7pm and 9pm. As the annual Brahmotsavams is set to commence on second week of September, the Pournami Garuda Seva is considered as a rehearsal to the main one.

All the security, driking water, crowd management, cultural troupes were reviewed by the concerned authorities on this occasion


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

ఆగస్టు 26, తిరుమల 2018 ;తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారంనాడు శ్రావణపౌర్ణమిరోజున మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను రాత్రి 7 నుండి 9 గంటల నడుమ టిటిడి ఘనంగా నిర్వహించింది. సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మూెత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా టిటిడి ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి ఉత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.