VAHANA SEVAS – A SPECIAL ATTRACTION DURING BRAHMOTSAVAMS _ సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirumala 26 August 2018: The Vahana Sevas remains special attraction during brahmotsavams of Sri Venkateswara Swamy at Tirumala.
This year twin brahmotsavams are set to woo the pilgrims due to Adhika Masam which is also known as Purushottama Masam and is dedicated to Lord Vishnu.
The annual Navahnika Brahmotsavams are scheduled from September 13th to 21st while the Navarathri Brahmotsavams are slated from October 10th to 18th.
Every day there will be vahana sevas both in the morning and in the evening. This year keeping in view the convenience of the multitude of visiting pilgrims TTD has slightly amended the timings of evening Vahana Sevas after discussing with Agama pundits and religious staffs of Tirumala temple.
Usually every year vahana sevas are observed between 9am and 11am while Garuda Seva which falls on fifth day of brahmotsavams by 7.30pm. But from this year onwards the evening Vahana Sevas will be observed between 8am and 10am and Garuda Seva at 7pm.
Meanwhile the important days in September Brahmotsavams includes Dhwajarohanam on September 13th, Garuda Vahana Seva on September 17th, Swarnaratham on September 18th at 5pm, Rathotsavam on September 20th and Chakrasnanam on September 21st.
While the most important vahana sevas during Navarathri Brahmotsavams includes Garuda Seva on October 14th, Pushpaka Vimanam on October 15th, Swarnaratham on October 17th and Chakrasnanam on October 18th.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఆగస్టు 26, తిరుమల 2018 ; తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల సమయంలో టిటిడి స్వల్పమార్పులు చేపట్టింది. ఉదయం 9 నుండి 11 గంటల వరకు వాహనసేవ జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులేదు. రాత్రివేళ ఒక గంట ముందుగా అనగా 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ జరుగుతుంది. గరుడవాహనసేవ అరగంట ముందుగా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 12న అంకురార్పణం నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
(9గం|| నుండి 11 గం|| వరకు) (8 గం|| నుండి 10 గం||ల వరకు)
13-09-2018 సా|| ధ్వజారోహణం (4 నుంచి 4.45 గం||ల వరకు), పెద్దశేషవాహనం
14-09-2018 చిన్నశేష వాహనం హంస వాహనం
15-09-2018 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
16-09-2018 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
17-09-2018 మోహినీ అవతారం గరుడ వాహనం
(రా.7 నుండి 12 వరకు)
18-09-2018 హనుమంత వాహనం స్వర్ణరథం (సా.4 నుండి 6 వరకు),
గజవాహనం
19-09-2018 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
20-09-2018 రథోత్సవం(ఉ.7.30 గంటలకు) అశ్వ వాహనం
21-09-2018 చక్రస్నానం ధ్వజావరోహణం
(ఉ.7.30 నుండి 10 వరకు) (రా|| 7 నుంచి 9 వరకు)
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.