SRAVANA UPAKARMA IN SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ

Tirumala, 19 August 2024: Shravana Upakarma was performed in Tirumala Srivari Temple on Monday on the auspicious occasion of Sravana Pournami on Monday.

As part of this, Sri Krishna Swamy is brought on a procession to the temple of Sri Bhuvarahaswamy and performed Snapana Tirumanjanam.  

After that, a new Yajnopaveeta was presented to the Lord and the Asthanam was held.  

Later Swami reached the temple in a procession.

Temple Peishkar Sri Srihari, priests and other officials participated in this program. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ

తిరుమల, 2024 ఆగష్టు 19: తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉద‌యం 6 గంటలకు శ్రీ కృష్ణ‌స్వామివారిని
శ్రీ భూవ‌ర‌హ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకువ‌చ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకించారు. అనంతరం స్వామివారికి నూత‌న య‌జ్ఞోప‌వీతాన్ని స‌మ‌ర్పించి, ఆస్థానం నిర్వహించారు. అనంత‌రం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య‌ పేష్కర్ శ్రీ శ్రీ‌హ‌రి, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.