SRI KAMAKSHI AMMAVARU ON THE TEPPA _ తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారు దర్శనం
Tirupati, 11 January 2025: As part of Sri Kapileswara Swamy Teppotsavams in Tirupati, Sri Kamakshi Ammavaru gave darshan on Saturday night between 6.30 pm and 8 pm.
The float festival was an eye feast for devotees Sri Kamakshi Ammavaru, seated on the beautifully decorated Teppa blessed devotees by taking seven rounds.
Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Chandrasekhar, Temple Inspector Sri Balakrishna and a large number of devotees participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారు దర్శనం
తిరుపతి, 2025 జనవరి 11: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మవారు దర్శనమిచ్చారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ కామాక్షి అమ్మవారు కపిలతీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.