SRI KRISHNA WEARS NEW YAGNOPAVEETAM _ శ్రీకృష్ణస్వామి వారికి నూతన యజ్ఞోపవీతం
TIRUMALA, 22 AUGUST 2021: On the auspicious occasion of Shravana Upakarma on Sunday, Sri Krishna Swamy was offered with a new Yagnopaveetam.
Earlier, the deity was brought from the temple on a procession and was taken to Swamy Pushkarini opposite Sri Varaha Swamy temple and special Abhishekam was rendered.
Later, the priests amidst chanting of Vedic hymns offered new Yagnopaveetam (holy thread) and the deity was brought back to the Srivari temple. This holy event takes place every year on the occasion of Shravana Pournami between 6am and 7am.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీకృష్ణస్వామి వారికి నూతన యజ్ఞోపవీతం
తిరుమల, 22 ఆగస్టు 2021: శ్రావణ ఉపకర్మ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారికి ఆదివారం నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. శ్రావణ పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ వరాహ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న స్వామి పుష్కరిణి
వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నూతన యజ్ఞోపవీతం(పవిత్రమైన దారం) ధరింపజేశారు. అనంతరం శ్రీవారి ఆలయానికి వెంచేపు చేశారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.