SRI KT PAVITROTSAVAMS COMMENCE _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
Tirupati, 24 July 2018: The Pavitrotsavams in Sri Kapileswawa Swamy temple commenced on Tuesday.
Celestial Snapana Thirumanjanam was performed to Panchamurthies including Sri Soma Skanda Murthy, Sri Kamakshi Ammavaru, Sri Vighneshwara Swamy, Sri Valli Devasena Sametha Subrahmanya Swamy, Sri Chandikeshwara Swamy Utsava Murthies amidst chanting of veda mantras as per the tenets of Saivagama.
Pavitra Pratistha will be performed on the first day evening in Yagashala.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 24 జూలై 2018 ;తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం చేశారు. ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీకామాక్షి అమ్మవారు, శ్రీవిఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీచండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, విభూది, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గహస్థులు పవిత్రోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గహస్థులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరి రోజు పవిత్రమాలలు బహుమానంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం,సూపరింటెండెంట్ శ్రీరాజ్‌కుమార్,టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనారాయణ, ఆలయ అర్చకులు శ్రీ స్వామినాథన్ స్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉదయస్వామి,
ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.