SRI MALAYAPPA BLESSES DEVOTEES IN GAJENDARA MOKSHA ALANKARAM _ సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో శ్రీమలయప్ప అభయం
GRAND SARVABHOOPALA VAHANA SEVA DRAWS LARGE NUMBER OF DEVOTEES
Tirumala, September 18, 2026: As part of the Srivari Salakatla Brahmotsavams, Sri Malayappa Swamy, along with Sridevi and Bhudevi, blessed devotees in Gajendra Moksha Alankaram on the Sarvabhoopala Vahanam on Friday night.
The grand procession through the Mada Streets witnessed vibrant cultural performances by artistes from various states. Large numbers of devotees gathered to have the darshan of Sri Malayappa Swamy and experienced the divine atmosphere.
Sarvabhoopala Vahanam – Symbol of Auspiciousness
Sarvabhoopala means all kings and represents the Ashtadikpalakas, the guardians of the eight directions. The vahana signifies the divine protection of Lord Vishnu and conveys the message of peace, prosperity and welfare of the people through His blessings.
The vahana seva was witnessed by Tirumala Pedda Jeeyar Swamy, Chinna Jeeyar Swamy, TTD Chairman Sri B.R. Naidu, EO Sri Muddada Ravichandra, Board Members, Additional EO Sri C.H. Venkaiah Chowdary, CVSO Sri K.V. Muralikrishna and others.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో శ్రీమలయప్ప అభయం
భక్తులను అలరించిన వైభవోపేత వాహనసేవ –
మాడ వీధుల్లో ఆధ్యాత్మిక సందడి
మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన ఈ వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సర్వభూపాల వాహనం – యశోప్రాప్తికి ప్రతీక
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. ఇందులో అష్టదిక్పాలకులు కూడా ఉంటారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరృతి, పశ్చిమాన వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతారు.
అష్టదిక్పాలకులంతా శ్రీమహావిష్ణువును తమ భుజస్కంధాలపై, హృదయంలో కొలువుంచి సేవిస్తారనే భావనకు సర్వభూపాల వాహనం ప్రతీకగా నిలుస్తుంది.
శ్రీమలయప్పస్వామివారి అనుగ్రహంతో రాజ్యపాలన సుభిక్షంగా సాగి, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ వాహనసేవ చాటిచెబుతుంది.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.












