SRI PADMAVATHI DEVI BLESSES DEVOTEES ON GOLDEN CHARIOT _ స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

Tirupati, August 21, 2026: As part of the Varalakshmi Vratam celebrations at Tiruchanoor Sri Padmavathi Ammavari Temple, Sri Padmavathi Devi blessed devotees with darshan on the Golden Chariot on Friday.

A large number of women devotees participated in the Golden Chariot procession and pulled the chariot along the four Mada Streets with devotion. Devotees offered camphor harathi, had darshan of the Goddess and sought Her blessings.

TTD JEO Dr. A. Sharath, Temple Deputy EO Sri Harindranath and a large number of devotees participated in the celebrations.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

తిరుపతి, 2026 ఆగస్టు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు.

స్వర్ణరథోత్సవంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నాలుగు మాడ వీధుల్లో రథాన్ని లాగారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్‌తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది