SRI PADMAVATHI RIDES ON GARUDA VAHANAM _ గరుడ వాహనంపై హరి అంతరంగ అలమేలుమంగ

DEVOTEES THRONG IN HUGE NUMBERS

Tiruchanoor, 28 Nov. 19: The sixth day evening witnessed Sri Padmavathi Devi taking a pleasure ride on Garuda Vahanam on Thursday. 

The Goddess in Her Nijaawarupa as Padmavathi Devi graced on the mighty Vainateya as Her celestial carrier and marched magestically along the mada streets. 

The devotees who occupied every inch of four mada streets surrounding the temple at Tiruchanoor,  were mused at the divine sight of Goddess who appeared on the king of Aves and shouted loudly “Garuda vahana…Govinda Govinda” out of religious ecstasy.

TTD EO Sri Anil Kumar Singhal, Additional CVSO Sri Sivakumar Reddy, DyEO Sri C Govindarajan were also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

 

గరుడ వాహనంపై హరి అంతరంగ అలమేలుమంగ

తిరుపతి, 2019 నవంబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం రాత్రి అమ్మవారు విశేషమైన గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. రాత్రి 7.30 నుండి 11.30 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తున్నారు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, ఆదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ కాండూరి శ్రీ‌నివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.