SRI PAT POTU TO BE MODERNISED TTD CHAIRMAN_ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య పోటును ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

Tiruchanoor, 30 Jan 2019: TTD Chairman Sri Putta Sudhakar Yadav today visited the Kitchen, potu in Sri Padmavati Ammavari temple, at Tiruchanoor is being modernised to cater Anna Prasadam and Laddu Prasadam to devotees.

Speaking to reporters on the occasion the TTD chairman who inspected the queue lines and the Potu at Ammavari temple gave several suggestions for improving the services to devotees.

He said all arrangements were made for grand Bhukarshana and Bijavapanam rituals at Amaravati, the emerging capital of Andhra Pradesh.

DyEO of Sri PAT Smt Jhansi Rani and other officials participated in the chairman visit.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య పోటును ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

తిరుప‌తి, 30 జనవరి 2019: సిరుల త‌ల్లి తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో పోటు, క్యూలైన్ల‌ను టిటిడి ఛైర్మ‌న్ శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ బుధ‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి త‌నిఖీ చేసారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అమ్మ‌వారికి నిత్యం నైవేద్యం త‌యారుచేసే అన్న‌ప్ర‌సాదాల పోటు, ల‌డ్డూ పోటును ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

అనంత‌రం ఛైర్మ‌న్ మాట్లాడుతూ అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు, ల‌డ్డూలు ఆల‌యంలోని పోటులో త‌యారుచేస్తున్న‌ట్లు తెలిపారు. అమ్మ‌వారి పోటును మ‌రింత ఆధునిక‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు.

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణార్థం జనవరి 31వ తేదీ గురువారం ఉద‌యం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు భూకర్షణం మరియు బీజావాపనంను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్ప‌ట్లు పూర్తి చేశామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.