THREE-DAY SRI PURANDARA DASA ARADHANA MAHOTSAVAM AT TIRUMALA_ పిబ్ర‌వరి 3 నుండి 5వతేదీ వరకు తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

Tirumala, 30 January 2019: To promote Bhakti culture the TTD Dasa Sahitya Project plans to conduct a 3 day Sri Purandara Dasa Aradhana Mahotsavam from February 3 to Feb 5 at the holy shrine of Tirumala.

On Day-1 the Mahotsavam will unfold at Asthana Mandapam from morning 5.30 am with Suprabatham, meditation, and bhajan Sangeet, sankeertans, literary seminar, messages from Pontiffs.

On Day-2 after garlanding of Sri Purandara Dasa statue at Alipiri programs will commence at Asthana Mandapam with pontiff’s mangala shadanam, procession of utsava idols from Srivari temple to Narayanagiri gardens, unjal seva and sankeertans.

The highlights of last day events will be Haridasa Rada Manjari and Sri Ananda Theerthacharya will supervise the conduction of all programs to promote Bhakti culture.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

పిబ్ర‌వరి 3 నుండి 5వతేదీ వరకు తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

తిరుమల, 2019 జనవరి 30: కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో పిబ్ర‌వ‌రి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో జరుగనున్నాయి.

మొదటిరోజైన పిబ్ర‌వరి 3న ఆదివారం తిరుమలలోని ఆస్థాన మండ‌ప‌ములో ఉదయం 5.30 గం||ల నుండి 7.00 గం||ల వరకు సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, ఉదయం 8.30 గం||ల నుండి 9.30 గం||ల వరకు పురంధరదాసుల సాహితీ గోష్ఠి, ఉదయం 9.30 గం||ల నుండి మధ్యాహ్నం 12.00 గం||ల వరకు వివిధ పీఠాధిపతుల మంగళా శాసనాలు, మధ్యాహ్నం 2.30 గం||ల నుండి 5.30 గం||లవరకు సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రెండవ రోజైన పిబ్ర‌వరి 4న సోమ‌వారం ఉదయం 6.00 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పణ, అనంతరం తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.00 వరకు వివిధ పీఠాధిపతుల మంగళా శాసనాలు, అదేరోజు సాయంత్రం 6.00 గం||టలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.

చివరిరోజు పిబ్ర‌వరి 5వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం 6.00 గం||ల నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం, ధ్యానం, సామూహిక భ‌జ‌న‌, న‌గ‌ర సంకీర్త‌న, ఉద‌యం 8.00 నుండి 9.00 గం||ల వరకు హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.