SRI RAMA GRACED ON HAMSA VAHANA _ హంస వాహనంపై శ్రీ కోదండ‌రాముడి క‌టాక్షం

Vontimitta, 22 Apr. 21: On the second day evening as part of the ongoing annual brahmotsavams at Vontimitta in YSR Kadapa district on Thursday evening, Sri Rama graced on Hamsa Vahana.

In view of covid-19 Seva took place in ekantham inside Temple.

Hamsa stands for Paramahamsa tatva and always known for its wisdom to separate milk from water. By riding this Vahana, Sri Rama shows that He is always there to save good from evil forces.

Temple Deputy Sri Ramesh Babu, AEO Sri Muralidhar and others present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హంస వాహనంపై శ్రీ కోదండ‌రాముడి క‌టాక్షం

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 22: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం రాత్రి హంస వాహనంపై శ్రీ కోదండ‌రాముడు సీతా, లక్ష్మణ సమేతంగా ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధ‌నంజ‌యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.