SRI SITARAMA KALYANAM AT SRI KRT _ ఏకాంతంగా శ్రీ సీతారాముల కల్యాణం

Tirupati, 22 April 2021: TTD organised the traditional Sri Sitarama Kalyanam fete as part of the Sri Ramanavami celebration at the Sri Kodandaramaswamy temple on Thursday evening in ekantham in view of Covid-19 guidelines.

The temple archaka Sri Ananda Dikshitulu supervised the grand fete after performing Punya Havachanam, Sadyp Ankurarpanam, Raksha Bandanas and Vishesharadhana.

Thereafter the majestic kalyanam event the utsava idols of Swami and his consorts were taken in a procession in the evening.

Temple special grade DyEO Smt Parvati, Chief Engineer Sri Ramesh Reddy, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh archakas and staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏకాంతంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుప‌తి, 2021 ఏప్రిల్ 22: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం శ్రీ‌ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా క‌ల్యాణం నిర్వ‌హించారు.

సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ఆల‌య అర్చ‌కులు శ్రీ ఆనంద దీక్షితులు ఆధ్వర్యంలో కల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌, విశేష నివేద‌న‌, మాల‌మార్పిడి, అక్ష‌తారోహ‌ణ‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.