SRI RAMA GRACES ON DIVINE SWAN CARRIER _ హంస‌ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి క‌టాక్షం

Tirupati, 14 March 2021: Sri Kodanda Rama Swamy graced on the beautifully decked divine Hamsa Vahana on the second day evening of the ongoing annual brahmotsavams in Tirupati. 

On Sunday night vahana Seva, the processional deity eloquently seated on the swan carrier blessed His devotees. 

Due to Covid guidelines, the annual fete is being observed in Ekantam. 

Both the senior and junior Pontiffs of Tirumala. Spl. Gr. Dy E O Smt. Parvati, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh Kumar were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హంస‌ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి క‌టాక్షం

తిరుపతి, 2021 మార్చి 14: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం రాత్రి హంస‌ వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.