SRI RAMAKRISHNA THIRTHA MUKKOTI HELD IN EKANTHAM _ ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

Tirumala, 28 January 2021: Keeping in view the ongoing COVID-19 restrictions, TTD on Thursday organised the annual festival of Sri Ramakrishna Thirtha Mukkoti in Ekantham.

Normally this festival is held in the Pushyami month in Pushyami Nakshatram wherein a large number of devotees take holy bath in the Ramakrishna thirtha.

However, in view Covid guidelines and health safety of devotees, the festival was observed in Ekantham by TTD

As part of festival Archakas from Srivari temple went in a procession and performed abhisekam to idols of Sri Ramachandra and Sri Krishna followed by special pujas and naivedyam.

TTD board member Sri Murali Krishna, Arjitam inspector Sri Suryanarayana Raju, engineering, forest and vigilance staffs were present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

తిరుమ‌ల‌, 2021 జ‌న‌వ‌రి 28: తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి గురువారం ఏకాంతంగా జ‌రిగింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాలను దృష్టిలో ఉంచుకుని ఏకాంతంగా నిర్వ‌హించారు.

ప్రతిఏటా పుష్య‌మి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ ప‌ర్వ‌దినం నాడు ఎక్కువ మంది భ‌క్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్ర‌దాయం ఉన్నందువ‌ల్ల, భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా చేప‌ట్టారు.

శ్రీవారి ఆలయం నుంచి అర్చ‌క సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ బయలుదేరి శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్క‌డ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం స‌మ‌ర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ ముర‌ళీకృష్ణ‌, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సూర్య‌నారాయ‌ణ రాజు, ఇంజినీరింగ్‌, అట‌వీ, విజిలెన్స్ త‌దిత‌ర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.