SRI SUNDARARAJASWAMY ABHISHEKAM AT TIRUCHANOOR _ తిరుచానూరులో శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి అభిషేకం

Tiruchanoor, 2 June 2020: As a part of ongoing annual float festival, Sri Padmavati ammavari Teppotsavam, abhisekam was performed to Sri Sundarajaswamy inside the temple corridors in view of Covid-19 restrictions. 

TTD is also organising daily abhisekam to Ammavari utsava idols from June 3-5 as a part of Teppotsavam festival.

Dyeo Smt Jhansi Rani, AEO Sri Subramanyam and other officials participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI    

తిరుచానూరులో శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి అభిషేకం

తిరుపతి, 2020 జూన్ 02: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండ‌వ రోజైన మంగ‌ళ‌వారం శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో  ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి.

ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. కాగా జూన్‌ 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.