SRI VENKATESWARA VAIBHAVOTSAM CONCLUDES AT NELLORE _ WITH THE GRAND SPECTACLE OF SRIVARI KALYANAM _ నెల్లూరులో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం _ – ముగిసిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు

Nellore,20, August 2022:  Nellore citizens were privileged to a grand spectacle of Srivari Kalyanam heralding the conclusion of the five-day fete of Sri Venkateswara Vaibhavotsam at AC Subba Reddy stadium on Saturday evening.

Vedic Pundits brought out the Utsava idols of Sri Malayappa and his consorts Sri Devi and Sri Bhudevi Amidst chanting of Veda mantras and Mangala vaidyas the rituals of Viswaksena Aradhana, Punya vachanam,kankana Dharana, Agni prathistapana,yajamani Sankalp, devotees Sankalp, Maha Sankalp, and mangalsutra Dharana were completed paving way for Kalyanam.

Thereafter nakshatra harati and Mangala harati were performed to herald the grand conclusion of celestial Kalyanam. The devotional elixir touched the sky with the chanting of Govinda, Govinda resounding in the stadium.

Earlier Sri Srinivasa blessed devotees during Sahasra Deepalankara Seva held as part of the last event of the Sri Venkateswara Vaibhavotsam fete at Nellore. the Nitya kainkaryas will continue in the model Srivari temple and concludes with the EKantha Seva.

TTD chairman  Sri YV Subba Reddy couple, MP Sri Vemireddy Prabhakar Reddy, Delhi local advisory committee chairman Smt V. Prashanti Reddy, MP Dr. Gurumoorthy, MLA sr Kotam Reddy Sridhar  Reddy, MLC Sri Kalyan Chakravarti, NUDA chairman Sri Mukkala Dwaraknath, JEO Smt Sada Bhargavi, and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నెల్లూరులో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం

– ముగిసిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు

నెల్లూరు, 2022 ఆగస్టు 20 ;నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజు శనివారం సాయంత్రం
శ్రీవారికి. కల్యాణోత్సవం నిర్వహించారు . నెల్లూరు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణోత్సవం తిలకించారు. దీంతో వైభవోత్సవాలు ముగిసాయి .

సాయంత్రం 6.30 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు . చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన వేలాది మంది భక్తజనం చేసిన గోవింద నామ స్మరణతో స్టేడియం మార్మోగింది .

అంతకు ముందు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవలో శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు. రాత్రి 10 నుంచి 10.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. రాత్రి 10.30 గంటలకు ఏకాంతసేవ జరుగనుంది.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిదంపతులు , రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్ష్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ,ఎంపి డాక్టర్ గురుమూర్తి , ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి , ఎమ్మెల్సీ శ్రీ కళ్యాణ చక్రవర్తి ,నుడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారక నాథ్ , జెఈవో శ్రీమతి సదా భార్గవి తదితరులు పాల్గొన్నారు .

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.