SRI VENKATESWARA VEDA VIGNANA PEETHAM- A CENTRE FOR THE TRANSFER OF ANCIENT KNOWLEDGE TO SOCIETY _ నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వీ వేద విజ్ఞానపీఠం అడుగులు – బ్ర‌హ్మోత్స‌వాల‌లో వేద విద్యార్థుల వేద ఘోష‌

IMPARTING VEDIC EDUCATION TO THOUSANDS OF YOUTH SINCE 1884

VEDIC VIBRATIONS DURING BRAHMOTSAVAMS

TIRUMALA, 16 SEPTEMBER 2022: With a noble aim to sustain the great knowledge embedded in Vedas for future generations, TTD has established a Vedic institution in the year 1884 which has now transformed into Sri Venkateswara Veda Vignana Peetham.

HISTORY OF DHARMAGIRI VEDA VIGNANA PEETHAMS: 

Going back to its initial days, the Veda Pathashala has first commenced at Nammalavar Temple inside Govindaraja Swamy Temple complex in Tirupati by the then custodian of Sri Venkateswara temple, Mahant Sri Prayag Das. In the beginning, only three important branches of Vedas i.e. Krishna Yajurveda (Taittiriya), Vaikhanasa Agama and Divyaprabandham were taught.

The 132-year institution has today blossomed into a hub of Vedic learning in 1954, this institution was shifted to Sampangi Mandapam in the Srivari temple and shifted to Vasanta Mandapam later. Again, the institution was shifted to Narasingapuram and Kalyani Dam near Tirupati. However in 1992, with great intention to establish the institution in Ancient Gurukula Method on the lap of Sri Venkateswara Swamy, this institution was established with new buildings at Dharmagiri in a sprawling 35 acre area in the deep green woods of Seshachala ranges that is located about 5km away from Tirumala shrine.

 WHAT IS TAUGHT AND TO:

Since last century young students from age of 10-12 years were till now taught nuances of ancient knowledge and skill sets in utilising such knowledge for society. Predominately they were taught Vedas, Agama (puja and ritual methodology) Smartha (a tradition in Hinduism that is embedded with Puranas and reflects a synthesis of four philosophical strands, namely Mimamsa, Advaita, Yoga and Theism) and Divya Prabandam.

Dharmagiri peetham has now emerged into a knowledge hub to higher studies in Shastras, Vedangas, Dharma Shastras, and Purana itihas and also research. The institution has expanded its knowledge base to impart education in a total of 17 courses including 7 Veda Sakhas, 5 Agama Sakhas, 4 Smartha Sakhas and Divya Prabandam. As on date it houses 535 students and 48 Acharyas. Students from the age of 10 with a fifth class pass will be recruited in a 12-year course while those aged between 12-14yeas are being recruited with a Seventh class pass and the traditional Upanayanam (holy thread ceremony) for eight-year courses. As of now all students from Hindu Brahmin families are eligible.

For all selected students the TTD provides free accommodation, boarding, clothes and books. The medium of education is Sanskrit only. To ensure financial security and to guard against dropouts, TTD deposits a sum of ₹3 lakhs (for Veda courses) and ₹ 1 lakh for other courses in Agama, Smartha and Divya Prabandam. The stipend amount along with interest earned on deposits is given to students after they complete the 12-year courses. The successful students also received a silver dollar (10 grams) and also job opportunities in TTD temples on availability. 

The students of Peetham are also positioned in various temples of state endowments department; Mutts while some have been selected for overseas temples like US, UK etc.

SUBJECTS TAUGHT

The syllabus and course material of this institute are universally accepted and copied in other institutions of the country and also abroad.

VEDAS & ITS BRANCHES:

Rigvedam, Krishnayajurveda (Taittiriya & Maitrayani), Shuklayajurveda (Kanva), Samaveda (Kauthuma & Jaiminiya) Atharvavedam (Saunaka).

COURSE DURATION: ALL VEDAS- 12 YEARS

(Krishnayajurveda (Maitrayani) and Atharvaveda (7 years), All Agama, Smarta & Divyaprabandham (8 years).

Divyaprabandham & Agama Courses Vaikhanasa Agama, Pancharatra Agama, Sri Vaishnava Agama, Saivagama, Tantrasaragama, Smartha Courses: Rigveda Smartam, Krishnayajurveda Smartam, Shuklayajurveda Smartam and Vaikhanasa Smartam.

PRACTICAL VEDIC STUDIES

Study of Vedas is not a theoretical course but hands on tutoring. Besides classroom teaching, focus is more on constant practice and perfecting the pronunciation and rendering etc.  Daily four to five hours is allotted for such practice. The TTD also ensured protection of mental and physical health of students residing at Dharmagiri as the children are away from their parents for a long time while pursuing Vedic education. A special instructor is appointed to train them in daily sports. Students are segregated in hostels as seniors and juniors age wise. Complaint boxes are kept handily around campus for the benefit of students to bring their issues to teachers and administration in a safe manner.

ALUMNI AND EMINENT SCHOLARS:

Eminent Vedic scholars had been the products of this great Vedic institution, which includes, the present senior pontiff of Tirumala, Sri Sri Sri Pedda Jeeyarswami who studied Divya Prabandam and also served as Principal of the Dharmagiri Peetham for many years.

Other reputed Vedic, Agama, and Sastraic scholars like Sriman Rompicherla Parthasarathi Bhattacharyulu, Sriman Sudarshanacharyulu, Sriman R. Krishna Swamy Iyyengar, BrahmaSri Anantha Narayana Sastri, BrahmaSri Dhulipala Ramachandra Sastri, Sriman K. Sundaracharyulu, Sriman K. Varadacharyulu, and Sriman N. A. K Srinivasacharyulu, BrahmaSri G. K. Ramamurthy, Rigveda Salakshana Ghanapathi rendered their services valuable for the development of the institution.  At present Sri K.S.S. Avadhani, an eminent scholar in Krishna Yajurveda Bhashya and Tarka Sastra Pandit is the Principal of the Dharmagiri Veda Vignana Peetham since 2011.

APPRECIATION BY APSCPCR

Recently the Andhra Pradesh State Commission for Protection of Child Rights, led by its Chairman Sri Keesala Appa Rao has visited Dharmagiri Veda Vignanana Peetham and interacted with the students about the amenities being provided to them in the institution. The students also expressed that their faculty are looking after them as their own children with love, affection and care as they are away from their parents to pursue education for a long period. 

The Commission also verified the facilities to the students in hostel, classrooms, dining hall etc. and expressed immense satisfaction over the treatment and care being given to the students and issued a Certificate of Appreciation.

MOCK BRAHMOTSAVAMS AS PRACTICALS

The students apart from imparting theoretical education, are also given an opportunity to participate in the festivals, rituals etc.  to provide them hands-on experience. They also participate in Rituals performed at Tirumala by TTD during some important events like annual brahmotsavams, pavithrotsavam etc. and such exposures are being treated as practical sessions to the Vedic students. Even the students will take part in the various Parayanams that will be organised on the occasion.

Besides, a mock Brahmotsavams fete will be organised in the Dharmagiri premises where the students prepare all the Vahanams and perform the annual fete. The Vedic institution similarly organizes Ganapathi Utsavams, Somavara Special Programmes etc. to impart practical knowledge to their students which will be useful for them for their future career.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPAT

నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వీ వేద విజ్ఞానపీఠం అడుగులు

– బ్ర‌హ్మోత్స‌వాల‌లో వేద విద్యార్థుల వేద ఘోష‌

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 16: తిరుమల తిరుపతి దేవస్థానం విధుల్లో వేదపరిరక్షణ ఒకటి. వేదాలను పరిరక్షించి విస్తృతంగా ప్రచారం చేసేందుకు, సమాజహితం కోసం వేదవిజ్ఞానాన్ని అందరికీ అందించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తిరుమలలోని ధర్మగిరిలో ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో విద్యార్థులకు వేద విద్యను అందిస్తోంది.

ఇక్కడ వేదం, ఆగమం, స్మార్థం, దివ్య ప్రబంధం కోర్సులను ఇప్పటివరకు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత కోర్సులైన శాస్త్రాలు, దర్శనాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రం, పురాణేతిహాసాలతో పాటు పరిశోధనలకు పెద్దపీట వేస్తూ నైపున్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వీ వేద విజ్ఞానపీఠం అడుగులు వేస్తోంది.

సుదీర్ఘ చరిత్ర సొంతం :

శ్రీవేంకటేశ్వర వేదపాఠశాలను 1884వ సంవత్సరంలో తితిదే ఏర్పాటుచేసింది. 132 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల పాఠశాలగా ఇది గుర్తింపు పొందింది. 1992వ సంవత్సరంలో తిరుమలలోని ధర్మగిరిలో వేద పాఠశాలను నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 7 వేదశాఖలు, 5 ఆగమ శాఖలు, 4 స్మార్థ శాఖలు, ఒక దివ్యప్రబంధ శాఖ కలిపి మొత్తం 17 శాఖలున్నాయి. మొత్తం 535 మంది విద్యార్థులు, 48 మంది అధ్యాపకులు ఉన్నారు. 12 సంవత్సరాల కాలపరిమితి గల వేదశాఖల్లో ప్రవేశానికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఐదో తరగతి ఉత్తీర్ణులై, ఉపనయనం పూర్తయిన వారు, 8 ఏళ్ల కాలపరిమితి గల ఆగమ, స్మార్థ, దివ్యప్రబంధ కోరుల్లో ప్రవేశానికి 12 నుంచి 14 ఏళ్లలోపు వయసుండి, ఏడో తరగతి ఉత్తీర్ణులైన, ఉపనయనం పూర్తయిన విద్యార్థులు అర్హులు. ప్రవేశం పొందిన విద్యార్థులకు భోజనం, వసతి, వస్త్రాలు, పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. అన్ని శాఖల విద్యార్థులకు సంస్కృతం బోధిస్తారు. వేద విద్యార్థులకు కోర్సు ప్రారంభంలో రూ.3 లక్షలు, ఆగమ, స్మార్థ, దివ్యప్రబంధం విద్యార్థులకు రూ.ఒక లక్ష డిపాజిట్‌ చేస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి అందజేస్తారు.

ప్రాక్టికల్‌ శిక్షణ – మాదిరి బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌

వేద పాఠశాలలో విద్యార్థుల దృష్టి అంతా అభ్యసనపైనే ఉండేలా రోజువారీ సమయాన్ని పెంచారు. నేర్చుకున్న పాఠ్యాంశాలను సాధన చేసేందుకు ఉదయం, మధ్యాహ్నం కలిపి నాలుగు గంటలు సమయం పెంచారు. అలాగే శారీరక, మానసిక వికాసం కోసం ప్రతిరోజూ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయుడిని నియమించారు.

ఇక వీలైనప్పుడల్లా తిరుమల శ్రీవారికి జరిగే సేవలు, ఉత్సవాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. వీటితోపాటు ప్రతినెలా హోమాలు, కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు తదితర క్రతువులు, ఉత్సవాలు వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రాక్టికల్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.

హాస్టల్లో జూనియర్‌, సీనియర్‌ విద్యార్థులకు వయసుల వారీగా వేరువేరుగా గదులు కేటాయించారు. విద్యార్థుల సమస్యలు ఏవైనా ఉంటే అప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా పాఠశాలలో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటుచేశారు. ఆరుగురు ఉపాధ్యాయులు రాత్రివేళ కూడా హాస్టల్లో ఉంటూ విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు.

మెండుగా ఉపాధి అవకాశాలు :

తితిదేలో పేరెన్నికగన్న అర్చకులందరూ ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. వీరిలో శ్రీ సుందరవరద భట్టాచార్య, శ్రీ ఎన్‌.ఎ.కె.శ్రీనివాసాచార్య, శ్రీ పెద్దజీయర్‌స్వామి తదితరులు ఉన్నారు. ఇక్కడ చదువుకున్న ప‌లువురు విద్యార్థులు టిటిడిలో అర్చకులుగా ఉద్యోగాలు సాధించారు. అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, మఠాల్లోనూ ఉపాధి అవకాశాలున్నాయి. ప‌లువురు విద్యార్థులు విదేశాల్లోని ఆలయాల్లోనూ అర్చకులుగా ఉపాధి పొందారు.

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్‌ కితాబు

రాష్ట్ర బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఛైర్మ‌న్ శ్రీ కేస‌లి అప్పారావు, స‌భ్యులు శ్రీ‌మ‌తి త్రిప‌ర్ణ ఆదిల‌క్ష్మి, శ్రీ‌మ‌తి ముడిమేల ల‌క్ష్మీదేవి ఇటీవల తిరుమ‌ల‌లోని వేద పాఠ‌శాల‌ను సందర్శించి కితాబిచ్చారు.

వేద పాఠ‌శాల‌ విద్యార్థుల‌తో కమిషన్ ఛైర్మన్, సభ్యులు మాట్లాడారు. అక్క‌డి వ‌స‌తులు, త‌ర‌గ‌తి గ‌దులు, హాస్టల్ ను ప‌రిశీలించారు. ఇక్కడి గురువులు తమ తల్లిదండ్రుల లాగా చక్కగా చూసుకుంటున్నారని విద్యార్థులు కమిషన్ కు తెలిపారు. బాల‌ల‌కు ఒత్తిడి లేకుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్యను అందిస్తున్నారని కమిషన్ అభిప్రాయపడింది. విద్యాబోధన, వసతుల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు వారు వేద విజ్ఞాన పీఠానికి ఒక ప్రశంసా పత్రాన్ని కూడా అందించారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌లో వేద విద్యార్థుల వేద ఘోష‌

ప్ర‌తి ఏడాది తిరుమ‌ల‌లో జ‌రిగే శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌లో వేద విద్యార్ధుల‌కు ప్ర‌త్యేక స్థానాన్ని టీటీడీ క‌ల్పిస్తోంది. ఈ ఏడాది కూడా తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌రిగే ప‌లు పారాయ‌ణ కార్య‌క్ర‌మాల‌లో వేద విద్యార్థులు పాల్గొంటారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.