SRINIVASA KALYANAM ALLURES DENIZENS OF ONGOLE _ కన్నులపండువగా ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

SEA OF HUMANITY TURNS OUT FOR MEGA FETE

 

Ongole, 09 November 2022: The celestial Srinivasa Kalyanam fete was observed with utmost religious grandeur at QIS Engineering Grounds in the outskirts of Ongole on Wednesday.

 

The team of TTD archakas and Veda pundits performed the Srinivasa Kalyanam as per Vaikhanasa Agama tradition to the accompaniment of Mangala Vaidyam.

 

TTD has been organizing the holy event in major cities and different places as a part of its noble mission to take forward Hindu Dharma Prachara across the country.

 

The various stages of Srivari Kalyanam fete included Punyahavachanam, Viswaksena Aradhana, Ankurarpanam, Maha Sankalpam, Kanyadanam, Mangalya Dharana,Varana Mayiaram and finally Harati was rendered.

 

DEVOTEES ENTHRALLED BY THE DIVINE MARRIAGE

 

Every inch of the venue was occupied by devotees who thronged to witness the celestial Kalyanam. The devotees were enthralled by the divine charm of Sridevi Bhudevi sameta Sri Srinivasa Kalyanam.

 

ELABORATE ARRANGEMENTS

 

Arrangements were made with grandeur to match the occasion by local legislator and donor Sri Balineni Srinivasa Reddy.

 

 

LED screens were displayed at vital places all along the venue for the sake of devotees who thronged in large numbers.

 

The celestial event was conducted in a religious manner between 6:30pm and 8:30pm by one of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu.

 

The Annamacharya Sankeertans rendered by Dr Sobharaj and Sri Madhusudhan Rao allured the devotees.

 

Minister Smt Rajani, MPs Sri Mastan Rao, Sri Vemireddi Prabhakar Reddy, Sri Srinivasulu Reddy, TTD Board members Sri Madhusudhan Yadav, JEO Smt Sada Bhargavi, CEO SVBC Sri Shanmukh Kumar, Additional FACAO Sri Raviprasadu were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కన్నులపండువగా ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

– వేలాదిగా హాజరైన భక్తులు

– ఆకట్టుకున్న అన్నమాచార్య సంకీర్తనల గానం

-. గోవింద నామస్మరణతో మార్మోగిన కల్యాణ వేదిక ప్రాంగణం

తిరుపతి 9 నవంబరు 2022: ఒంగోలు నగర శివారులోని క్విజ్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా గల మైదానంలో బుధవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో దాత , శాసన సభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఏర్పాట్ల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని చూసి తరించారు.

సాయంత్రం 6.30 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా కల్యాణంలోని ఆయా ఘట్టాలకు అనుగుణంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. శోభారాజ్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ మధుసూదన్ రావు బృందం అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా గానం చేశారు. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన వేలాది మంది భక్తజనం చేసిన గోవిందనామ స్మరణతో వేదిక ఆవరణం మార్మోగింది. భక్తులందరు శ్రీవారి కల్యాణాన్ని చూసేందుకు వేదిక ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఎల్ ఈ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, అర్చక బృందం నిర్వహించిన శ్రీనివాస కల్యాణ కార్యక్రమంలో దాత, శాసన సభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి దంపతులతో పాటు మంత్రి శ్రీమతి విడదల రజని, ఎంపిలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శ్రీ బీద మస్తాన్ రావు, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మాజీ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే , టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్సీ శ్రీ మాధవ్, ఎమ్మెల్యేలు శ్రీ కరణం బలరాం, శ్రీ సుధాకర్ బాబు, శ్రీ కోన రఘుపతి, శ్రీ అన్నా రాంబాబు , శ్రీ విక్రమ్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ సిద్దా రాఘవ రావు, టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి , ఎస్వి బిసి సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, అదనపు ఎఫ్ఎసిఏఓ శ్రీ రవిప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.