SRIVARI ANNUAL FLOAT FESTIVAL BEGINS AT TIRUMALA _ శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

Tirumala, 24 March 2021: With total adherence to Covid guidelines, the Srivari annual Teppotsavam (float festival) got underway at Swami Pushkarini on Wednesday evening.

The colourfully decorated float with flowers and shining electrical illumination thrilled devotees on the banks of Swami Pushkarini as a procession of utsava idols of Sri Sita Lakshmana sameta Ramachandra Murthy graced and blessed the devotees.

Earlier the procession of Utsava idols began on Mada streets and reached the Swami Pushkarini where they boarded the spectacular float and went for three rounds amidst Veda, Ganam and devotional music.

Tirumala pontiff Sri Sri Sri Pedda Jeeyarswamy, Additional EO Sri AV Dharma Reddy, TTD board member Sri DP Ananta, CE Sri Ramesh Reddy, Srivari temple DyEO Sri Harindranath were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

మొద‌టిరోజు శ్రీ సీతారామలక్ష్మణులు తెప్పపై విహారం

తిరుమల, 2021 మార్చి 24: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధ‌వారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ పుష్క‌రిణిలో తెప్పోత్స‌వాలు నిర్వ‌హించారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.