SRIVARI ARJITA SEVA ONLINE SEPTEMBER QUOTA TO RELEASE ON JUNE 27 _ జూన్ 27న ఆన్‌లైన్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు సెప్టెంబర్ నెల కోటా విడుదల

Tirumala, 25 June 2022: TTD will release of the online quota of arjita Seva tickets for the month of September on June 27.

Among the total of 46,470 tickets, the lucky dip Seva tickets includes 8070 while the sevas on a first in first out basis includes 38,400.

The arjita sevas viz Suprabatham, Tomala, Archana and Astadala Pada Padmaradhana tickets are allotted in lucky dip for which devotees should register online between 10 am of June 27 and 10am of June 29.

Tickets confirmation is made after online lucky dip drawls. The list of those allotted tickets are updated on the TTD website after 12noon of June 29 and the devotees are informed via SMS and e-mails.

All the allotted devotees should credit the ticket fare within two days of the announcement.

While the general sevas including Kalyanotsavam, Unjal Seva, arjita Brahmotsavam and Sahasra Deepalankara will be released on June 27 at 4pm and shall be booked on a first-come first-served basis.

Devotees are advised to make note of these guidelines before booking their Seva tickets.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూన్ 27న ఆన్‌లైన్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు సెప్టెంబర్ నెల కోటా విడుదల

తిరుమల, 2022 జూన్ 25: సెప్టెంబరు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్ లో జూన్ 27న టీటీడీ విడుదల చేయనుంది.

మొత్తం 46,470 టిక్కెట్‌లలో, లక్కీ డిప్ సేవా టిక్కెట్లు 8070 ఉన్నాయి. అదేవిధంగా ముందు వ‌చ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న‌ 38,400 టికెట్లు ఉన్నాయి.

ఆర్జిత సేవలైన సుప్రబాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాద పద్మారాధన టిక్కెట్లు లక్కీ డిప్‌లో కేటాయించబడతాయి. దీని కోసం భక్తులు జూన్ 27 ఉదయం 10 నుండి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

ఆన్‌లైన్ లక్కీ డిప్ డ్రా తర్వాత టిక్కెట్‌ల నిర్ధారణ చేయబడుతుంది. కేటాయించిన టిక్కెట్ల జాబితా జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్ మరియు ఇ-మెయిల్‌ ద్వారా తెలియజేయబడుతుంది.

టికెట్లు పొందిన గృహ‌స్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది.
భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఈ సేవా టికెట్ల‌ను బుక్ చేసుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలు జూన్ 27న సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయించబడుతుంది.

భక్తులు తమ సేవా టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ఈ మార్గదర్శకాలను గమనించి పొందాలని టిటిడి కోరుతున్నది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.