DALLAS MESMERIZED BY DIVINE CHARM _ డల్లాస్ లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం

TIRUPATI, 26 JUNE 2022: As a part of the ongoing Srinivasa Kalyanam in different cities of the United States of America, the NRI denizens were mesmerized by the divine charm of the deities during the celestial wedding ceremony.

 

Srinivasa Kalyanam was performed with religious fervour amidst chanting of Vedic mantras in the city of Dallas during wee hours on Sunday as per Indian Standard Time.

 

TTD Chairman Sri YV Subba Reddy, AP NRT Chief Sri Venkat, Sri Raju Vegnesa, Government Advisor Sri Rathnakar, SVBC Director Sri Srinivasa Reddy and others participated.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డల్లాస్ లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం

– పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

తిరుపతి 26 జూన్ 2022: అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.

కళ్యాణోత్స క్రతువులో భాగంగా
పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.

టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, విశాఖపట్నం ఎంపి శ్రీ సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ ఆర్ ఐ సలహాదారు శ్రీ జ్ఞానేంద్ర రెడ్డి, వై ఎస్ ఆర్ జిల్లా జెడ్ పి చైర్మన్ శ్రీ అమర్నాథ రెడ్డి, తెలుగుబాషా సంఘం చైర్మన్ శ్రీ లక్ష్మీ ప్రసాద్, ఉత్తర అమెరికా లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ రత్నాకర్, ప్రతాప్ భీమ్ రెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ శ్రీ మేడపాటి వెంకట్, శ్రీ రాజు వేఘ్నేశ, నాటా అధ్యక్షులు శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ రఘువీర్ బండారు, శ్రీ రమేష్ వల్లూరు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది