SRIVARI PUSHPAYAGAM TICKETS ON NOVEMBER 4 _ శ్రీవారి పుష్పయాగం

TIRUMALA, 03 NOVEMBER 2023: The TTD EO Sri AV Dharma Reddy during the monthly Dial your EO program informed pilgrims about various upcoming religious events.

 

SOME EXCERPTS:

 

TTD will release 1000 tickets online on November 4 at 700 for each ticket on which two persons will be allowed.

KARTHIKA MASA PROGRAMS

 

TTD is organising several Dharmic and spiritual programs during ensuring Karthika month.

 

* November 14-December 12  Narada Puranam Parayanam will be conducted at the Nada Neeranjanam platform at Tirumala.

 

* Similarly Rudrabhishekam will be performed at the Dhyana mandir in SV Veda University in Tirupati from November 14-December 12.

 

* Nagula Chaviti will be performed on November 17 at SVVedic university Yagashala.

 

* At Tirumala Vasantha Mandapam: on Prabodana Ekadasi day Sri Vishnu Saligrama puja will be observed on November 23, Kaishika Dwadasi day on November 24 Sri Tulasi Damodar Puja, Gopuja on 29 and Dhanvanthri Jayanti on December 10.

 

Karthika deepotsavam will be observed on November 20 at Tirupati, 27 at Kurnool, December 11 at Vizag Karthika

 

Homa utsavams will be conducted at Sri Kapilaeswawara Swami temple in Tirupati from November 14-December 12.

 

Other festivals in Tirumala includes Deepavali  Asthanam on November 12,  Kaishika Dwadasi  Asthanam on November 24 and Sri Chakra Theertha  Mukkoti also on the same day. 

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and other officers were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

అంద‌రి స‌హ‌కారంతో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం

– భ‌క్తుల‌కు సంతృప్తిక‌రంగా వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌మూర్తి ద‌ర్శ‌నం

– అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు

– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023 న‌వంబ‌రు 03: శ్రీ‌వారి సాల‌క‌ట్ల‌, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌ను అంద‌రి స‌హ‌కారంతో విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల‌, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తుల‌కు ఎలాంటి ఆసౌక‌ర్యం క‌లుగ‌కుండా వాహ‌న‌సేవ‌ల‌తో పాటు మూల మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పించిన‌ట్లు చెప్పారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు.

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తాం.

– ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

– విశేషమైన పంచమి తీర్థం నాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇందుకోసం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తాం.
– దాదాపు రూ.9 కోట్ల వ్యయంతో అమ్మవారి పుష్కరిణి ఆధునీకరణ పనులు చేపట్టాం. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నారు.

శ్రీవారి పుష్పయాగం

– నవంబరు 19న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం నవంబరు 18న అంకురార్పణ నిర్వహిస్తారు.

– ఈ పుష్పయాగం ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా నవంబరు 4న శనివారం 1000 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తాం. టికెట్‌ ధర రూ.700/-గా నిర్ణయించాం.

– పుష్పయాగం టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు ఒక చిన్నలడ్డూ, ఉత్తరీయం, బ్లౌజ్‌ పీస్‌ బహుమానంగా అందిస్తాం.

– తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో అక్టోబ‌రు 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుండి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో రెండు చిరుతలు, ఒక ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరా ట్రాప్‌లో నమోదయింది.

– కావున నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగానే వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

– 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేయవచ్చు.

– చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి.

కార్తీక మాస ఉత్స‌వాలు

– పవిత్రమైన కార్తీక మాసంలో పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– నవంబరు 14 నుండి డిసెంబరు 12వ తేదీ వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై నారదపురాణం పారాయణం జరుగనుంది.
– నవంబరు 14 నుండి డిసెంబరు 12వ తేదీ వరకు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ధ్యానారామంలో రుద్రాభిషేకం నిర్వహిస్తాం.
– నవంబరు 17న తిరుపతి ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలోని యాగశాలలో నాగులచవితి పూజ నిర్వహిస్తాం.

తిరుమల వసంత మండపంలో…

– నవంబరు 23న ప్రబోధన ఏకాదశి రోజున శ్రీ విష్ణుసాలగ్రామ పూజ.
– నవంబరు 24న కైశికద్వాదశి రోజున శ్రీ తులసి దామోదర పూజ.
– నవంబరు 29న గోపూజ.
– డిసెంబరు 10న ధన్వంతరి జయంతి.

కార్తీక దీపోత్సవాలు

– నవంబరు 20న తిరుపతి, 27న కర్నూలు, డిసెంబరు 11న వైజాగ్‌లో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నాం.

హోమ మహోత్సవాలు

– నవంబరు 14 నుండి డిసెంబరు 12వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీకపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలు నిర్వహిస్తాం.

నవంబరు 12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
– శ్రీవారి ఆలయంలో ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

– ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు.

– సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు.

– ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

నవంబరు 24న కైశిక ద్వాదశి ఆస్థానం – ఎస్వీబిసిలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం

– కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. మొద‌టిసారిగా స్వామివారి ఊరేగింపును ఎస్వీబిసిలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

– వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు.

– అనంతరం ఉదయం 5.30 నుండి ఉదయం 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

నవంబరు 24న చక్రతీర్థ ముక్కోటి

– తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలలో చక్రతీర్థ ముక్కోటి ఒకటి.

– చక్రతీర్థ ముక్కోటినాడు ఉదయం అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాలతో ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళతారు.

– చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారువారికి, శ్రీ నరసింహస్వామివారికి, శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, పూజలు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.

అక్టోబరు నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 21.75 లక్షలు

హుండీ :
– హుండీ కానుకలు – రూ.108.65 కోట్లు

లడ్డూలు :
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1.05 కోట్లు

అన్నప్రసాదం :
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 47.14 లక్షలు

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 8.30 లక్షలు

ఈ కార్యక్రమంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిశోర్, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌విబిసి సిఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.