VAIKUNTHA EKADASI TICKETS IN ONLINE ON NOVEMBER 10-EO _ న‌వంబ‌రు 10న ఆన్‌లైన్‌లో 2.25 ల‌క్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

Tirumala, 03 November 2023: The monthly Dial your EO program was held at the Annamaiah  Bhavan on Friday where in 28 pilgrim callers from various States participated in this live phone in program and given that valuable suggestions to TTD EO Sri AV Dharma Reddy.

 

Before attending to these calls the EO briefed it the pilgrims on the various development activities taken up by TTD in the last month and also on the upcoming religious events.

 

The annual Brahmotsavam of Sri Padmavati temple at Tiruchanoor will be observed in a grand way from November 10-18.

 

The important events includes Dwajarohanam on November 10, Gaja Vahana on 14, Panchami Theertham on 18, Pushpa Yagam on 19.

 

TTD has spent 9 crore towards the renovation of Ammavari Pushkarani and all departments are making elaborate arrangements for devotees benefit.

 

TTD is organising the Vaikunta Dwara Darshanam fete from December 23 with Vaikuntha Ekadasi fete till January 1 providing Vaikunta Dwara Darshan to lakhs of devotees.

 

In this regard the Rs.300 SED tickets will be released online on November 10.

 

TTD is releasing 2.25 lakh tickets during these ten days. Similarly, 20thousand SRIVANI tickets will be released online. The SRIVANI ticket holders will also be provided Rs.300 darshan only during Vaikuntha Dwaram period as in the case of previous years.

 

TTD will issue 4.25 lakh SSD tokens during these days in 100 counters at nine different places in Tirupati for the benefit of common pilgrims.

 

Those without tickets or tokens can come to Tirumala and visit other places but will not allowed for darshan during these ten days.

 

TTD has cancelled all privileged Darshan like parents with infants, challenged persons, senior citizens and NRIs from December 23-January 1.

 

All arjita Sevas also remains cancelled during the period.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

న‌వంబ‌రు 10న ఆన్‌లైన్‌లో 2.25 ల‌క్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

– డిసెంబ‌రు 22న తిరుప‌తిలో 4.25 ల‌క్షల టోకెన్లు జారీ

– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023 న‌వంబ‌రు 03: డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 ల‌క్ష‌ల రూ.300/- దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 10వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న‌ట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,

– వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం.

– తిరుప‌తిలో 9 కేంద్రాల‌లో 100 కౌంట‌ర్ల‌లో డిసెంబ‌రు 22వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు 4.25 లక్షలు విడుదల చేస్తాం.

– డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు రద్దు.

రోజుకు రెండు వేల‌ శ్రీవాణి టికెట్లు

– తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 23 నుండి 2024 జ‌న‌వ‌రి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

– భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుంది.

– భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.