SRIVARI SAHASRA DEEPALANKARA SEVA BEGINS, SAYS ADDITIONAL EO _  శ్రీ‌వారి స‌హ‌స్ర‌దీపాలంకార‌ సేవ‌ ప్రారంభం – అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి

Tirumala, 1 Nov. 20: Following devotee request TTD has resumed the popular arjita sevas Sahasra Deepalankara Seva, Dolotsavam and Arjita Brahmotsavam from Sunday onwards.

Participating in the Sahasra Deepalankara Seva outside Srivari temple for first time since lockdown restrictions were enforced in March last, the TTD additional EO Sri AV Dharma Reddy said that for 226 days TTD observed the arjita sevas in Ekantham due to Covid guidelines.

He said Sri Malayappa has come out of Srivari temple after long gap today in the Sahasra Deepalankara Seva and blessed devotees.

He appealed to devotees to observe social distancing and wear masks while participating in the seva and beget blessings of Sri Venkateshwara.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి స‌హ‌స్ర‌దీపాలంకార‌ సేవ‌ ప్రారంభం – అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2020 న‌వంబ‌రు 01: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో నిర్వ‌హించే డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార‌ సేవ‌ల‌ను భ‌క్తుల కోరిక మేర‌కు ఆదివారం నుండి ప్రారంబించినట్లు అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన శ్రీవారి స‌హ‌స్ర‌దీపాలంకార‌ సేవ‌లలో అయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నదన్నారు. దాదాపు 226 రోజుల తరువాత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం బయట భక్తులకు దర్శనం ఇచ్చినట్లు వివరించారు.

భక్తులు భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. 

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.