శ్రీవారి సేవకుడు శ్రీ ఎం. సుమన్ మృతికి సంతాపం తెల్పిన టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
శ్రీవారి సేవకుడు శ్రీ ఎం. సుమన్ మృతికి సంతాపం తెల్పిన టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
తిరుపతి, 2019 జూలై 09: స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందిన శ్రీవారి సేవకుడు శ్రీ ఎం. సుమన్ మృతికి టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ సంతాపం వ్యక్తం చేశారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని, వీరి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు.
శ్రీ సుమన్ మృతి వార్త తెలియగానే, వారి కుటుంబసభ్యులను చరవాణి ద్వారా టిటిడి ఛైర్మన్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ చరవాణి ద్వారా టిటిడి ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. టిటిడి నిబంధనల ప్రకారం సహాయ సహకారాలు అందిస్తామని ఛైర్మన్ ప్రకటించారు. మృతుడి పార్థీవ దేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శవపరీక్ష అనంతరం మృతదేహన్ని స్వగ్రామానికి తరలించారు.
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా, ధర్మరామం మండలం, కీిలవనపర్తి గ్రామంకు చెందిన శ్రీ ఎం. సుమన్ శ్రీవారి సేవకు వచ్చి తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ రెండో అంతస్తు భవనం నుండి ప్రమాదవ శాత్తు జూలై 2వ తేది రాత్రి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స కోసం స్విమ్స్‌లోని అత్యవసర వార్డులో చేర్పించారు. ఈ నెల 4వ తేది గురువారం టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి స్వయంగా స్విమ్స్‌ను సందర్శించి పరామర్శించిన విషయం తెలిసిందే.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.