SRIVARU BLESSES DEVOTEES IN SARASWATI ALANKARAM AT PRAYAGRAJ _ ప్రయాగ్ రాజ్ లో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక ఊంజల్ సేవ

TIRUMALA, 03 FEBRUARY 2025: Following the auspicious day of Vasanta Panchami on Monday, the Utsava deity of Srivaru in the replica temple at Prayagraj blessed devotees in Saraswati Devi Alqnkaram.

Among the umpteen number of Hindu festivals, Vasanta Panchami happens to be one of the most significant festivals in Hindu Santana Dharma.

Sri Saraswati Devi, the Goddess of Wisdom is being offered special prayers on this auspicious day seeking Her divine blessings for acquiring knowledge and intellect.

At the replica Srivari temple in Prayagraj, the religious staff of TTD decked Srivaru as Goddess Saraswati and performed special  Unjal Seva in the morning amidst the chanting of Vedic hymns by Vedic scholars.

Later the Annamacharya Project artistes presented Annamacharya Sankeertans.

The devotees who witnessed the celestial swing festival with Srivaru in all His divine charm donning Saraswati Devi Alankaram, were surrounded by the devotional vibes.

DyEO Sri Siva Prasad, HDPP officers Sri Ramgopal, Sri Rajagopal, AEO Sri Ravi and other staff were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రయాగ్ రాజ్ లో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక ఊంజల్ సేవ

తిరుమల, 2025 ఫిబ్రవరి 03: ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో సోమవారం వసంత పంచమి పర్వదినం పురస్కరించుకుని సందర్భంగా శ్రీ శ్రీనివాస స్వామికి ప్రత్యేక ఊంజల్ సేవ నిర్వహించారు.

వేద పండితుల వేదమంత్రాల నడుమ శ్రీ స్వామివారు వీణాపాణియై సరస్వతి అలంకారంలో ఊయలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారి ఊంజల్ సేవ ను తిలకించి ఆనందంతో పరవశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, హెచ్ డీపీపీ అదనపు సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్, ఏఈవో శ్రీ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.