TTD CONDUCTS ANNUAL VISESHA POOJA FOR THE FIRST TIME _ శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజ

TIRUMALA, 03 FEBRUARY 2025: TTD for the first time conducted Visesha Pooja as an annual ritual on the auspicious occasion of Vasanta Panchami on Monday.

It may be mentioned here that in the past, Visesha pooja introduced by TTD in the early 90s used to be performed as a weekly Arjita Seva on every Monday in the Srivari temple.  

The last TTD board decided to conduct Vasantotsavam, Sahasra Kalasabhishekam and Visheshapuja once on a year as per the suggestions of Jeeyangars, Archakas and Agama Pundits to prevent damage of the ancient Utsava Murtis and protect them for future generations to witness the grandeur of the processional deities in Tirumala Temple.

To this extent, for the first time, the annual Vishesh Puja was celebrated on the occasion of Vasantha Panchami at Kalyana Mandapam of Srivari Temple on Monday.  

As a part of it the priests worshipped Sridevi Bhudevi sameta Sri Malayappa Swamy and performed special pooja. 

Starting with Punyahavachanam, various other rituals were performed including Chaturdasa Kalasa Avahanam and concluded with Purnahuti.

Henceforth, TTD will conduct the annual Visesha puja on the auspicious day of Vasantha Panchami every year as Circar(in Ekantam).

TTD Additional EO Sri. Ch Venkaiah Chowdary, Deputy EO Sri. Lokanatham and other officials participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజ

తిరుమల, 2025 ఫిబ్రవరి 03: శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి పర్వదినం సందర్భంగా వైభవంగా నిర్వహించారు.

గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విషేశపూజను ఏడాదికోసారి నిర్వహించాలని గత టీటీడీ బోర్డు నిర్ణయించింది.

ఇకపై ప్రతి ఏడాది వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేషపూజను సర్కార్ (ఏకాంతం)గా టీటీడీ నిర్వహించనుంది.

ఈ మేరకు తొలిసారిగా వార్షిక విశేషపూజను వసంత పంచమి సందర్భంగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో సోమవారం వైభవం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్దశ కలశావాహనం గావించి పుణ్యహవచనం, వివిధ క్రతువులను నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది